Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీలర్లు, రిటైలర్లతో నిర్వాహకులు కుమ్మక్కు
- కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయాలు
- న్యాయం చేయాలని రైతుల వేడుకోలు
నవతెలంగాణ-పెద్దవంగర
మండలంలో ఎరువుల బ్లాక్ దందా జోరుగా సాగుతోంది. డీలర్లు, రిటైలర్లు కుమ్మక్కై ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను నిలువునా దోచుకుంటున్నా రు. మండల కేంద్రంలోని మన గ్రోమోర్ నిర్వాహకులు, ఓ ఫర్టిలైజర్ దుకాణంతో కుమ్మక్కై అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారని పలువుర రైతులు ఆరోపి స్తున్నారు. వాస్తవానికి మన గ్రోమోర్లో రూ. 270 విక్రయించాల్సిన యూరియా బస్తాను, మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాపుకు రూ. 320లకు వందల సంఖ్యలో ఎరువుల బస్తాలను విక్రయిస్తున్నారు. వారు రైతులకు రూ. 350 విక్ర యిస్తూ, రైతుల సొమ్మును కాజేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరి స్తూ, ఎరువుల బ్లాక్ దందా చేస్తున్న, మన గ్రోమోర్ నిర్వాహకుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన రైతులకు గ్రోమోర్ నిర్వాహ కులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ, మా ఇష్టం ఏం చేస్తారంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. గత పది రోజులుగా ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడుతు న్నారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి, మన గ్రోమోర్ నిర్వాహకులు రైతులు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు.రైతులు అధికధరలకు ఎరువులను కొనుగోలు చేయ లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కాగా మండల కేంద్రంలోని ఆ ఫర్టిలై జర్ షాపు ఓ వ్యవసాయ అధికారి సన్నిహితులదని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ అధికారులు మండలంలోని ఎరువుల దుకా ణాలపై తనిఖీలు చేసి, రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అధికారులు మన గ్రోమోర్, ఫర్టిలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇటీవల పోచంపల్లి గ్రామ పరిధిలోని దేవునిబాయి తండాకు చెందిన గుగు లోతు హనుమంతు గ్రామంలోని ఓ ఎరువుల దుకాణం వద్ద కొనుగోలు చేసిన ఎరువుల మందును తన 2 ఎకరాల పొలంలో పిచికారి చేయగా, పొలం ఎండిపో యిన ఘటన వెలుగులోకి రావడం కోసమెరుపు.