Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్తో సీట్ల సర్దుబాటు ఆరోపణలు అవాస్తవం
- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-గార్ల
కార్మిక చట్టాలను సవరిస్తూ మతోన్మాద, ఫాసిస్టు విధానాలను అవలంభిస్తూ దళితులు, క్రైస్తవులు, ముస్లింలపై దాడులు చేస్తున్న బీజేపీ పార్టీని అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో నిలవరించడమే కమ్యూనిస్టుల ప్రధాన కర్తవ్యం అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య అన్నారు. స్దానిక మంగపతిరావు భవనంలో సోమవారం బొబ్బా ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బడ్జెట్లో నిధులలో కోత విధించారని మండిప డ్డారు. ఆహార సబ్సిడీని ఎత్తివేయడంతో దేశంలో ఆకలి కొరత ఏర్పడుతుందని, ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడి నిరుద్యోగ కొరత పెరుగుతుందని ఆవేదన వెలిబు చ్చారు. కార్మిక హక్కులను కాల రాస్తూ 24 కోడ్ లను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుక వచ్చిన ప్రధాని మోడి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తూ ఎయిర్‌లైన్స్‌ను ప్రయివేట్ పరం చేస్తున్నారని అందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబానీతో పాటు కార్పొరేట్ శక్తుల సంపద మూడిం తల రెట్టింపు అయిందని,పౌరహక్కులు హరించబడి ప్రజాస్వామ్య వాదులపై దాడులు పెరిగాయని అందోళన వెలిబుచ్చారు.దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిందని, వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో అ పార్టీ డిలా పడటమే అందుకు ఉదాహరణ అన్నారు. రాష్ట్రంలో సియం కేసీఆర్ బీఆర్ఎస్ తరఫున ఎన్ని సీట్లు గెలుస్తాడో తెలియదు కానీ దేశాన్ని పాలిస్తాను అనడం హస్యాస్పదంగా ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పై రైతాంగం, కార్మికులు, నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారని సీఎం కేసీఆర్ ఇప్పటికీ వరకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే వచ్చే ఎన్నికల వరకు నెట్టు కోచ్చే పరిస్థితి ఉందని అన్నారు. పరిమితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళిత బంధు పథకాలను కేటా యించి బీఆర్ఎస్ కార్యకర్తలకే అందిస్తున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్నాయని దేశంలోను, రాష్ట్రంలోను బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రజా పునాదిని నిర్మించు కోవ డమే సీపీఎం తక్షణ కర్తవ్యం అన్నారు. బీఆర్ఎస్తో సీట్ల సర్దుబాటు పై పత్రికల లో వస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని, బీజేపీ విధానాలను ప్రతిఘటించేందుకే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నామని, ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తు పై నిర్ణయాలు ఉంటాయని నొక్కి వక్కాణించారు. క్షేత్ర స్దాయిలో పార్టీని బలోపేతం చేయడానికి స్దానిక పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపు నిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా, మండల కార్యదర్శులు సాధుల శ్రీనివాస్, కందు నూరి శ్రీనివాస్, జిల్లా, మండల కమిటీ సభ్యులు కందునూరి కవితా, భూక్య హరి, జి.రాజారావు, కె.ఈశ్వర్ లింగం, వి.వెంకటేశ్వర్లు, ఐ.గోవింద్, సిహెచ్. ఎల్లయ్య, ఎ.సత్యవతి,యం.నాగమణి,బి.లోకేశ్వరావు,సిహెచ్. మౌనిక, టి.రమా, మౌలానా, బాబు, శ్రీను, కే.బాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.