Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా తరలివచ్చిన జీపీ కార్మికులు
- సంఘీభావం ప్రకటించిన కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సమితి
నవతెలంగాణ-మహబూబాబాద్ డెస్క్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కా రం కోరుతూ సీఐటీయూ అనుబంధ గ్రామపంచాయ తీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో పాలకుర్తిలో ప్రారంభమైంది. పాదయాత్ర సోమవారం మానుకోట జిల్లా కురవి మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు ప్రారంభించగా ఈ యాత్ర కురవి నుండి జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ కార్యా లయం వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర సాగిన అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ అధికారి పున్నమి చందర్కి అందజేశారు.ఈ కార్యక్రమానికిముఖ్యాతిథి గా హాజరైన సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉ పేందర్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికులపట్ల వహిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడు తూ గ్రామపంచాయతీ సిబ్బంది మల్టీ పర్పస్ విధా నాన్ని ఎత్తివేసి, తెలంగాణలో అమలవుతున్న పిఆర్సి ప్రకారం కార్మికులకి 26వేల రూపాయల కనీస వేతన అమలు చేసి, పిఎఫ్ సదుపాయం కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జిపి సిబ్బంది పట్ల తెలంగాణ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూప డం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రతీ రోజు నిద్ర లేవగానే మన ఊరిని, మన పల్లెని పరిశుభ్రంగా ఉంచే ఈ కార్మికులను కంటికి రెప్పలా చూసుకోవా ల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యనమల కిరణ్, దుడ్డేల రామ్మూర్తి, చీపిరి యాకయ్య, మచ్చా వెంకన్న, సిఐటియు జిల్లా నాయకులు సమ్మెట రాజమౌళి, కుమ్మరి కుంట్ల నాగన్న, మల్లయ్య, వెంకన్న తోటశ్రీనివాస్ బండ్ల అప్పిరెడ్డి, సుధాకర్, అశోక్, ఉపేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.