Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
మండల కేంద్రంలో పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కంచ వెం కన్న అధ్యక్షతన జరిగిన అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ ప్రథ మ వర్ధంతి సభకు ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి కామ్రేడ్ కన్నం వెంకన్న ముఖ్యఅతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామ్రేడ్ తాం డ్ర కుమార్ మరణం పార్టీ, వామపక్ష ప్రజా ఉద్యమాలకు సామాజి క ఉద్యమాలకు తీరని లోటన్నారు. కుమార్ ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించి పాత రంగారెడ్డి జిల్లా మియాపూర్ గ్రామం లో అక్కడి పటేల్ పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. కంపెనీలలో జరుగుతున్న అన్యాయాన్ని కార్మికులకు తెలియజేసి కార్మిక సంఘాలను పెట్టి యాజమాన్యంతో పోరాటానికి కార్మికులను సిద్ధం చేసిన నాయకుడు కామ్రేడ్ తాండ్ర కుమార్ అ న్నారు.కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ త్యాగాలను చూసి సిద్ధాంతా న్ని వంట పెట్టించుకుని ఎందరో అమరవీరుల రక్తతర్పణ తోటి వెల సిన ఎంసిపిఐయూ ఎర్రని జెండాను భుజాన పెట్టుకొని మియాపు రం ప్రాంతంలో ప్రభుత్వ భూములలో నిలువ నీడలేని పేదలను చేరదీసి వారికి నిలువ నీడను చూపించిన గొప్ప మానవతవాది తాండ్ర కుమార్ అన్నారు.18 బస్తీలను ఏర్పాటు చేశారని తెలిపారు. అమరవీరుల త్యాగాలకు నిజమైన నివాళులు అర్పించిన వ్యక్తి కామ్రే డ్ తాండ్ర కుమార్ అన్నారు.పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పోలిట్ బ్యూరో సభ్యులుగా పార్టీకి ఎంతో సేవలు అందించిన అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్‌కి నిజమైన నివాళులు అందించడం అంటే ఈ దేశం లో జరుగుతున్న అవినీతిపై తిరగబడుతూ ప్రజలను ఏకం చేసి ప్రజా ఉద్యమాలను మునుముందుకు తీసుకుపోవాలని, గ్రామా లలో పార్టీని బలేపేతం చేయాలని అప్పుడే తాండ్ర కుమార్ నిజమై న నివాళులు ఇచ్చిన వారిమి అవుతామని వారన్నారు.
పార్టీ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ కామ్రేడ్ తాండ్ర కుమార్ ప్రజా ఉద్యమాలు నిర్మించి వీరోచితమైన పోరాటా లు నిర్వర్తించినాడని పోలీసు లాఠీలకు పోలీసు కేసులకు సైతం భయపడకుండా పాలకవర్గాల మీద సమరశీల పోరాటాలు నడిపిన త్యాగశీలి మడమతిప్పని పోరాట యోధుడు అని వారన్నారు. ఇట్టి పోరాటాలు చేస్తున్న క్రమంలో అతని మీద పీడీ యాక్ట్ లాంటి చట్టా లను ఉపయోగించి కేసులు పెట్టి జైలులో పెట్టినారని, పోలీసులు చిత్రహింసలు కూడా పెట్టినారని అయినా గాని వెను తిరగకుండా పోరాటాలు నడిపిన పోరాటయోధుడు అని, అతని స్ఫూర్తితో ఇప్పు డు నిరుపేదలు కార్మికులు రైతులు తమ హక్కుల కొరకు డబుల్ బెడ్ రూమ్‌ల సాధన కొరకు రుణమాఫీల కొరకు సమగ్ర చట్టాల కొరకు ఈ పాలకవర్గాల మీద పోరాటాలకు సంసిద్ధులు కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జాటోత్ బిచ్చ నాయక్, మండల కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, దయ్యాల కుమార్, ఏఐసీటీయూ నాయకులు ఉప్పలయ్య వీరన్న, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.