Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమగ్ర శిక్ష రాష్ట్ర పరిశీలకులు మనోహర చారి
నవతెలంగాణ- ములుగు
విద్యార్థుల ప్రగతి గురించి వారి తల్లిదండ్రులతో చర్చించాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పరిశీలకులు తిరుమల మనోహర చారి అన్నారు. జిల్లా క్వాలిటీ కో ఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి తో కలసి సోమవారం ములుగు జిల్లాలోని పలు పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమం నిర్వహణ తీరు, పదవ తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల నిర్వహణను పరిశీలించారు. వెంకటాపుర్ జెడ్పీహెచ్ఎస్, చల్వాయి ఎంపీపీఎస్, ములుగు జిహెచ్ఎస్, చల్వాయి కేజీబీవీ, మోడల్ స్కూల్, నార్లపుర్ జెడ్పిహెచ్ఎస్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 వ తరగతి విద్యా ర్థులకు ప్రత్యేక తరగతులు విధిగా నిర్వహించాలన్నారు. నూ తన ప్రశ్న పత్రంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రీ ఫైనల్ పరీక్షల తరువాత తప్పని సరిగా తల్లి తండ్రుల సమావేశం నిర్వహించాలన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, బోధనోపకరణాలు తయారుచేసుకొని బోధనాభ్యాసన చేయాలని చెప్పారు. మాసాంతపు పరీక్షలను నిర్వహించి ఫలితాలను నమోదు చేయాలని చెప్పారు. ఎస్ఆర్జిలు అమరవాది, రాఘవాచార్య, సముద్రాల శ్రీనివాసాచారి పాల్గొన్నారు.
పాఠశాలలను రాష్ట్ర విద్యాశాఖ బృందం పరిశీలన
గోవిందరావుపేట : మండలంలోని జిల్లా పరిషత్ చల్వాయి ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర విద్యాశాఖ పరిశీలక బృందం సోమవారం సందర్శించిందన ప్రధానోపాధ్యా యులు కుంజా రాజేశ్వరరావు అన్నారు. పదవ తరగతి విద్యార్థుల ప్రగతిని పరిశీలించి విద్యార్థుల విద్యా సామర్థ్యాల మెరుగుదలకు సూచనలిచ్చారన్నారు. స్టడీ అవర్ లో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర పరిశీలక బందం సభ్యులు టి మనోహరచారి, ఏవిఆర్ ఆచార్యులు, సముద్రాల శ్రీనివాసచారి, జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కో ఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సమ్మిరెడ్డి, ఉపాధ్యాయులు మొలుగూరి రమేష్, ఉప్పుతల ప్రసాద్, చల్లగురుగుల మల్లయ్య, బూత్కూరి శ్యామ్ సుందర్‌రెడ్డి, శ్రీ రాముల శ్రీనివాసరావు, భూక్య సరిత, తదితరులు పాల్గొన్నారు.