Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ దగ్గు సంధ్య వెంకటేశ్వరరావు,ఉప సర్పంచ్ కొమురోజు కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని వీడి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. గ్రామపంచాయతీ పాలకమండలి వార్డు సభ్యులతో పాటు దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గండ్ర దంపతులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత పాలకులు చేసిన అభివద్ధి కంటే సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు ఎంతో అభివద్ధి చెందుతున్నాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను సమదష్టితో చూసుకుంటూ అన్ని ప్రాంతాల ప్రజలకు నిష్పక్షపాతంగా అభివద్ధి కార్యక్ర మాలు, సంక్షేమ ఫలాలు అందేలా చేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన అభివద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని అన్నారు. జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్ హింగ మహేందర్, మండల అధ్యక్షుడు అంకం రాజేందర్, జెడ్పీటీసీ సాయిని విజయ, పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి రవీందర్రావు, జిల్లా నాయకులు ఉమేష్ గౌడ్, నాయకులు విద్యాసాగర్ రెడ్డి, సర్పంచులు శ్రీనివాసరావు, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.