Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి కె రాజ్‌కుమార్
నవతెలంగాణ-భూపాలపల్లి
పేదల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్లో బీజేపీ నాయకురాలు కీర్తి రెడ్డి కమ్యూనిస్టులపై చేసిన అసత్య ఆరోపణలను ఖండిస్తూ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్‌కుమార్ మాట్లాడారు. పేదలకు డబుల్ బెడ్ రూములు ఇవ్వడం లేదని పేదల పక్షాన సర్వే నెంబర్ 280 ప్రభుత్వ భూమిలో సుమారు మూడు వేల గుడిసెలు వేసుకుని ఉంటే తమ పార్టీ ఆధ్వర్యంలో వారికి అండగా నిలిచామన్నారు. పోరాటల ద్వారా జిల్లాలో కారల్ మార్క్స్ కాలనీ, సిఆర్నగర్, జవహర్ కాలనీలో పేదలందరూ నివాసం ఉంటున్నారని గుర్తు చేశారు. బూర్జవ పార్టీల లాగా పైసలు వసూలు చేసే సంస్కతి తమకు లేదని, కమ్యూనిస్టులు పైసలు వసూలు చేసినట్టు రుజువు చేస్తే ఏ చర్చకైనా తాము సిద్ధమని.. మీరు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్కు కొమ్ముకాస్తున్నారని అనడం సరైనది కాదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకు జిల్లా వ్యాప్తంగా పోరాటాలు చేసిన విష యం గుర్తు చేసుకోవాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్నారు. ఇప్పటికైనా కమ్యూనిస్టులపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కొరిమి సుగుణ, సోత్కు ప్రవీణ్,క్యాత్రజ్ సతీష్, కుడుదుల శ్రీకాంత్, రాజేశ్వరి, 100 మంది గుడిసవాసులు పాల్గొన్నారు.