Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బీఎంఎస్)
నవతెలంగాణ- కోల్బెల్ట్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నానాటికి రాజకీయ జోక్యం పెచ్చురెల్లిపోతున్నదని, దానిని పాతరెద్దామని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బీఎంఎస్) భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్ అన్నారు. సోమవారం బీఎంఎస్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా బొగ్గు గనుల్లో నిర్వహిస్తున్న ఆందోళనా కార్యక్రమాల్లో భాగంగా వివిధ గనుల అధికారులకు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 11వ వేజ్ బోర్డ్ సమావేశం ఏర్పాటు చేసి అలవెన్స్లపై పూర్తిస్థాయి ఒప్పందం చేయాలన్నారు. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి క్వార్టర్లను రాజకీయ జోక్యంతో ఇతరులకు ఇవ్వద్దని అన్నారు. తాత్కాలిక నివాసాలైనా బ్యారెక్స్ లలో నివసిస్తున్న కార్మికులకు హెచ్ఆర్ఏ చెల్లించాలని, తదితర వాటితోపాటు ఏరియాలో సింగరేణి యాజమాన్యం డిస్మిస్ చేసిన 47 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. భూపాలపల్లి ఏరియాలో పనిచేసే మెడికల్ అన్ఫిట్ ఉద్యోగుల సర్వీస్ రికార్డులలో కేసులను లోకల్లో జిఎం స్థాయి త్రీమన్ కమిటీ ఏర్పరిచి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. దరఖాస్తు చేసుకున్న డిపెండెంట్ ఉద్యోగులకు సకాలంలో విచారణ పూర్తి చేసి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏరియాలోని కేటీకే-1, 5,6,8, ఓసి టు గనులలో గని మేనేజర్ల గురించి పత్రాలు అందించారు. కేటీకే వన్ గనిలో అప్పాని శ్రీనివాస్, అల్లం శ్రీనివాస్, భాస్కర్, లక్ పతి , వి. సుజేందర్, మల్లారెడ్డి, రఘుపతి రెడ్డి, రమేష్, బ్రాంచ్ కార్యదర్శి సాంబయ్య గౌడ్ జనార్దన్ బత్తుల స్వామి, రాజిరెడ్డి, మొగిలి, జనార్దన్, సదనందం తదితరులు పాల్గొన్నారు.