Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ
నవతెలంగాణ-ములుగు
జీతాలు, డీఏల చెల్లింపుల్లో ఆలస్యం పట్ల ఉద్యోగులకు కోపం లేదని, తెలంగాణలో ఉద్యోగు లకు ఎటువంటి సమస్యలు లేవని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడడం సరికాదని, తమ జిల్లాకు వస్తే ఉద్యోగులంటేంటో చూపిస్తామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు. సోమవారం ములుగులో విలేకర్లతో వారు మాట్లాడారు. గత పీఆర్సీ అమలు సమ యంలో చాలా నష్టపోయామని, ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని సీపీఎస్ రద్దు చేయంచి జూలై నుండి కొత్త పీఆర్సీ అందుకు నేలా పోరాటాలు చేస్తామని అన్నారు. ములుగు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జాయింట్ కన్వీనర్ ఏళ్ళ మధు సూదన్, కో కన్వీనర్లు గుల్లగట్టు సంజీవ, అన్నవరం రవికాంత్, సర్వర్ అహ్మద్, హాట్కర్ సమ్మయ్య, మంకిడి రవి, జేఏసీ నాయకులు కుమార్, మొగిలి, పాషా, తదితరులు పాల్గొన్నారు.