Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వేయిస్తంభాలగుడి నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర
నవతెలంగాణ-సుబేదారి
హనుమకొండ జిల్లాలో వివిధ కేటగిరీలో పనిచే స్తున్న గ్రామ పంచాయితీ ఉద్యోగ కార్మికుల సమస్య లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వేయిస్తంభాల గుడి నుంచి హనుమకొండ జిల్లా కలెక్ట రేట్వరకు పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తం గా ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప రిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఫిబ్రవరి 12 నుంచి 28 వరకు పాలకుర్తి-పట్నం పాదయాత్ర నిర్వహిస్తుంది. పాదయాత్రకు మద్దతుగా జిల్లాలో ఐదు కిలోమీటర్ల పాదయాత్రను సీఐటీయూ జిల్లా కమిటీ సోమవారం రోజున చేసింది. అనంతరం గ్రామపంచాయతీ సి బ్బంది సీఐటీయూ నాయకులు జిల్లా కలెక్టరేట్ ఎదు ట అరగంట పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ సి క్తా పట్నాయక్ ఇచ్చారు. స్పందించిన జిల్లా కలెక్టర్ మూడునెలల బకాయి వేతనాన్ని వారం రోజుల్లో ఇ చ్చేవిధంగా చూస్తామని మిగతా డిమాండ్లను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ సీఐటీయూ నాయక త్వానికి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బందికి జీవో నెం.60 ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నట్లుగానే గ్రామపంచాయతీ కార్మికులకు రూ.16,500 వేతన ఇవ్వాలనియాక్ట్ 2/94ను రద్దుచేసి పంచాయతీ సి బ్బంది అందర్నీ పర్మనెంట్ చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, వారిని అసి స్టెంట్ కార్యదర్శిగా నియమించి ప్రభుత్వ గ్రాంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని రమేష్ డిమాండ్ చేశా రు. జీవో నెం.51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ వి ధానాన్ని రద్దుచేసి, మల్టీపర్పస్ విధానం ద్వారా నియ మించబడిన కార్మికులు చనిపోతే వారి కుటుంబంలో వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఈఎస్ఐ పీఎఫ్ ప్రమాద బీమా సౌకర్యా లు అమలు చేయాలని పోస్టు ఆఫీస్ ద్వారా ఇన్సూరె న్స్ను ప్రభుత్వమే అమలు చేయాలని కోరారు. పం చాయతీ కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇళ్ల స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5.50 లక్షల ఆర్థిక సహాయం అమలు చేయాలని, దళితబం ధు పథకాన్ని పంచాయతీ సిబ్బందికి ప్రాధాన్యత ఇ చ్చిఅమలు చేయాలని ఈ సందర్భంగా రమేష్ డి మాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నా లుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని కనీస వేతనం నెలకు రూ.26వేలుగా నిర్ణయించి అమలు చేయాల ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామపంచా య తీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అ ధ్యక్షులు పల్లె రామన్న, కార్యదర్శి గబ్బెట యాకయ్య , ఎం.భాస్కర్, పి.శంకర్,ఈ.విజరుకుమార్, ఏసోబు , జీ.గీత, గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.