Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అభివద్ధికి సహకరిస్తానని వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా తన ఎంపీ ల్యా డ్స్ నుంచి రూ.5లక్షలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రేటర్ వరంగల్ ప్రె స్క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశా ధికారి బోళ్ల అమర్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యులు ఎంపీ ద యా కర్ను సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీకి పు ష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వే ముల నాగరాజు మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అభివద్ధికి సహకరిం చాలని ఎంపీ దయాకర్‌ను కోరారు. అలాగే, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులం దరి చిరకాల కోరికైన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం నుంచి ఇప్పించేందుకు ఎంపీ కృషి చేయాలన్నారు. ప్రెస్‌క్లబ్ ఆవరణలో ఎంవోయూ పూర్తయిన బీఎస్ ఎన్ ఎల్ టవ ర్ను తొలగించి, కొత్త భవన నిర్మాణానికి సహకరించాల్సిందిగా ఎంపీని అధ్యక్షుడు వేముల నాగరాజు కోరారు.
ఈ సందర్భంగా ఎంపీ దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదన్నారు. జర్నలిస్టుల సమస్యలపై తనకు అవగాహన ఉం దని, తాను సాధారణ స్థాయి నుంచి రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడైయ్యేందుకు జర్నలిస్టులసహకారం చాలాఉందన్నారు. వరంగల్ ప్రెస్ క్లబ్ మౌలిక అవసరా లకు వినియోగించుకునేందుకు తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.5 లక్షలు త క్షణమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రెస్‌క్లబ్ అదనపు భవన నిర్మాణానికి, అభివధికి తనవంతు సాయంగా ప్రతీ సంవత్సరం రూ.5లక్షలు ఎంపీ ల్యాడ్స్ నుం చి విడుదల చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే, ప్రెస్ క్లబ్ ఆవరణలో ఎం వోయూ పూర్తయిన బీఎస్ ఎన్ ఎల్ టవర్ ను వెంటనే తొలగించాలని బీఎస్ఎన్ ఎల్ జీఎంను ఫోన్ ద్వారా సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ వైఎస్ ప్రెసిడెంట్లు గోకారపుశ్యాం, బొడిగె శ్రీను, అల్లం రాజేశ్ వర్మ, యాంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలు సంపెట సుధాకర్, వలిశెట్టి సుధాకర్, డాక్టర్ పొడిచెట్టి వి ష్ణువర్ధన్, ఈసీ మెంబర్లు వీరగోని హరీశ్, దొమ్మాటి శ్రీకాంత్, నయూంపాష, కమ టం వేణుగోపాల్, మంచాల రాజు పాల్గొన్నారు.