Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి
నవతెలంగాణ-వరంగల్
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీ యూజిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి అన్నారు. పాలకుర్తి నుంచి గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని పాదయాత్ర చేస్తున్న వాళ్లకు సీఐటీయు నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి, గ్రామపంచాయతీ జిల్లా అధ్యక్షుడు గూడెల్లి ఉప్పలయ్య హాజరై మాట్లాడుతూ గ్రామపంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు, సిబ్బందికి జీవో నెంబర్ 60 ప్రకారం పారిశుద్ధ కార్మికులకు రూ.15, 600 కారోబార్, బిల్ క లెక్టర్లకు రూ.19500, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ. 22,750లు వేతనాలు చెల్లించేం దుకు అసెంబ్లీ సమావేశంలో చర్చించాలని డి మాండ్ చేశారు.గత నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న సిబ్బంది వేతనాలు చెల్లిం చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12741 గ్రామ పంచాయతీలలో 36,500 మంది ఉద్యోగ కార్మికులకు వివిధ కేటగిరీలలో పనిచేస్తున్నారు.
పరిపాలన కోసం 500 జనాభా కి పైగా ఉన్న తండాలను అదనపు సిబ్బంది మౌలిక సదుపాయాల కల్పన నిర్వహణకు బడ్జెట్ ఇవ్వకుండానే గ్రామ పంచాయ తీలుగా మారుస్తూ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2022 సంవత్సరం జనాభా అవస రాలు ప్రకారం కార్మికులను నియమిం చకపోవడంతో ఇప్పటికే అదనంగా సంవత్సరాలు తరబడి ప్రజలకు సేవ లు అందిస్తున్న అదనపు సిబ్బందికి ప నికి భద్రత లేకుండా కరువైనాదని అ న్నారు. గత నాలుగు నెలలుగా వేత నాలను చెల్లించకపోవడంతో కార్మికు లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా రు. కారోబార్లు, బిల్కలెక్టర్ల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థంగా మారిందనీ అన్నా రు. పంచాయ తీ కార్మికులకు పర్మినెం ట్‌కు అడ్డుగా ఉన్న 2/94 ని రద్దుచేసి అందరిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 8 ఏళ్లు గడిచిన అమలుకు నోచుకోలేదని అన్నారు. అర్హత కలిగిన కారోబార్ బిల్ కలెక్టర్లకు అసిస్టెంట్ కార్యదర్శిగా నియమించా లి. పెరిగిన నిత్యవసర సరుకులకు ధ రలు అనుగుణంగా వేతనాల పెంచా లని కలెక్టర్గోపికి వినతిపత్రం అందజే శారు. ఈకార్యక్రమంలో సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు గున్నాల ప్రభా కర్, మూడేళ్ల ఉపేందర్, అప్పాజీ, వా ణి,రాధిక,సరిత, దివ్య, లక్ష్మి, మహబూ బ్, కిరణ్, మురళి, సదానందం తదిత రులు పాల్గొన్నారు.