Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్రలోనూ ఎవరి దారి వారిదే..
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎ రేవంత్‌రెడ్డి 'హాత్ సే హాత్ జోడో' పాదయాత్రలోనూ కాంగ్రెస్ నేతలు ఎవరి దారి వారిదేనన్నట్లు వ్యవహరిస్తు న్నారు. తొలుత మహబూబాబాద్ పార్లమెంటు ని యోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో పాద యాత్ర జరిగినా నర్సంపేట నియోజకవర్గంలో మినహాయించిన విషయం విదితమే. సోమ వారం సాయంత్రం వరంగల్ పశ్చిమ నియోజ కవర్గంలో పాదయాత్రను రేవంత్‌రెడ్డి ప్రారంభిం చనున్న నేపథ్యంలోనూ ఇక్కడి నుండి పార్టీ టికెట్నాశిస్తున్న హన్మకొండ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షు లు జంగా రాఘవరెడ్డి ఎవరికివారే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికివారే ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే రేవంత్‌రెడ్డి మేడారంలో పాద యాత్రను ప్రారంభించిన రోజే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 'నాయిని' పాదయా త్రను ప్రా రంభించడం గమనార్హం. మంగళవారం వరం గల్ తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర కొన సాగనుంది. ఇందుకు 'కొండా' దంపతులు ఏర్పాట్లు చేస్తున్నారు. 'కొండా' దంపతులను వ్యతిరేకించే వారు పాదయాత్రకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిపిసిసి అధ్య క్షులు, ఎంపి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన 'హాత్ సే హాత్ జోడో' పాదయాత్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్‌పై చేసిన వ్యాఖ్యలు ఒకటైతే, రెండోవైపు పార్టీలో కీలక నేతలు పాదయాత్రలో అంటిఅంటనట్లుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. తొలుత జిల్లాలో రేవంత్‌రెడ్డి మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేయాలని భావించారు. ఇందుకనుగుణంగా ములుగు ని యోజకవర్గంలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద మొక్కి పాద యాత్రను ప్రారంభించారు. ములుగు నియోజక వర్గంలో పాదయాత్రను ముగించి నర్సంపేట ని యోజకవర్గంలో ప్రవేశించాల్సి వుండగా, అకస్మా త్తుగా రూట్ మ్యాప్ మార్చి నర్సంపేట నియోజక వర్గాన్ని వదిలేసి మహబూబాబాద్ నియోజక వర్గంలోని కేసముద్రం మండలం నుండి ప్రారంభించారు. దీంతో రేవంత్‌రెడ్డికి, నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి దొంతి మాధవరెడ్డికి మధ్య విభేధాలున్న విషయం బహిర్గతమైంది. 'దొంతి' ఇదే క్రమంలో తన నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు.
వరంగల్ డిసిసి పీఠంపైనే విభేధాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, జనగామ, భూపాలపల్లి జిల్లాల డీసీసీల అధ్యక్షుల నియామకంలో తీవ్ర జాప్యం నెలకొంది. వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిని దొంతి మాధవ రెడ్డి తన సన్నిహితుడు పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డికి ఇప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ పదవి కోసం 'కొండా' దంపతులు తమ అను చరుడు నల్గొండ రమేష్‌కు ఇప్పించుకోవడానికి పట్టుపట్టారు. దీంతో వరంగల్ డిసిసి అధ్యక్ష పదవిపై ప్రతిష్టంభన నెలకొంది. దీంతో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై కోపం పెంచుకున్న 'దొంతి' పాదయాత్ర విషయంలో మోకాలొడ్డినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి నర్సంపేట నియోజకవర్గాన్ని మినహా యించి మిగతా 6 నియోజకవర్గాల్లో పాద యాత్రను తొలిదశలో పూర్తి చేశారు. భూపాలపల్లి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి విషయంలోనూ ప్రతి ష్టంభన నెలకొంది. ఇక్కడ మాజీ మంత్రి, మం థని ఎమ్మెల్యే డి. శ్రీధర్‌బాబు తన సన్ని హితుడికి డీసీసీ అధ్యక్ష పదవిని ఇప్పించుకోవడానికి ప్రయ త్నిస్తున్నారు. ఇక్కడ రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు గండ్ర సత్యనారాయణరావు ఈ పదవిని ఆశిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా నిర్ణ యం పెండింగ్‌లో ఉంది. జనగామ జిల్లా డిసిసి అధ్యక్ష పదవి విషయంలోనూ కొమ్మూరి ప్రతాప ్రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యల మధ్య పీఠముడిగా మారింది.
వరంగల్ పశ్చిమలోనూ పోటాపోటీ..
రేవంత్‌రెడ్డి పాదయాత్రలో హన్మకొండ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, జనగా మ డీసీసీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి తమ ఆ ధిపత్యం ప్రదర్శించడానికి తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలున్నాయి. వీరిద్దరూ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుండి పార్టీ టికెట్నాశిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర ఉత్కం ఠరేకెత్తిస్తుంది. మంగళవారం సైతం నియోజక వర్గంలో పాదయాత్ర కొనసాగించి సాయంత్రం నాటికి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రవేశించనుంది. గత ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన 'జంగా' ఈసారి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తానని ముందే ప్రకటించారు. పలుమార్లు నియోజకవర్గంలోని కాజీపేట ప్రాంతంలో పార్టీ కార్యక్రమాలను ఆయనే స్వయంగా నిర్వహించారు. దీనిపై 'నాయిని' టీపీసీసీ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేయడంతో 'జంగా'ను నియంత్రిం చారు. నాటి నుండి 'పశ్చిమ'లో ఈ ఇద్దరి నేతల మధ్య టగ్ ఆఫ్ వార్ నెలకొంది. రేవంత్‌రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో రెండు వర్గాలు పోటాపోటీగా ఆధిపత్యం ప్రదర్శించడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి.