Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశాన్ని విభజించాలని చూస్తున్న కేంద్రం
- నరేంద్ర మోడీకి కేసీఆర్ వసూళ్ల బినామీ..
- కుస్రు పాషా సేవలు కాంగ్రెస్ పార్టీకి కావాలి
- టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-కాజీపేట
మత సామరస్యానికి ప్రతీకగా కాజీపేట దర్గా నిలు స్తుందని, దేశాన్ని విభజించాలని చూస్తున్న కేంద్ర ప్రభు త్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హత్ జూడో యాత్రలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కాజీపేట దర్గలోని హజ్రత్ సయ్యద్ షా బియాబాని దర్గాను సోమవారం రేవంత్ రెడ్డి సందర్శిం చారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి కుసురుపాష రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... దర్గా కాజీపేట కు అందిస్తున్న దర్గా పీఠాధిపతి కుసురుపాషా సేవలు రాష్ట్రమంతా అందించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కుల మతాల మధ్య చిచ్చులు రాజేస్తు పాలన సాగిస్తుందని, రాజకీయ ప్రయోజనాల కొరకు మతం పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విభజించాలని చూస్తుం దన్నారు. స్వాతంత్ర ఉద్యమకారులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు నేడు దేశాన్ని సొంత లాభాల కోసం అమ్మకాలు చేస్తున్నారన్నారు. స్వాతంత్ర ఉద్యమ త్యాగాల పార్టీ కాంగ్రెస్ అని దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమ న్నారు. దేశాన్ని విభజించాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రాహుల్ గాంధీ దేశమంతట పాదయాత్ర నిర్వహించారని అన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో తాము హాత్ సే హాత్ జూడో యాత్ర ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలోని మైనార్టీలను ఏకం చేసి మైనార్టీల అభివృద్ధికి కృషి చేసే బాధ్యత కుసురు పాషాపై ఉందని అన్నారు. ప్రజల ఆశీస్సులతో తాము మళ్లీ దర్గాను సందర్శిస్తామ న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య, హను మకొండ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి, దర్గా యువ పీఠాధిపతి భక్తియర్ బాబా, తదితరులు పాల్గొన్నారు.