Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో మంత్రి కేటిఆర్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధించిన అధికారులను ఆదేశిం చారు.రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై సంబం ధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ సమావేశం నిర్వ హించారు. జిల్లాలో పలు కార్యక్రమాల ప్రారంభో త్సవాలు చేసేందుకు ఫిబ్రవరి 23న మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారని, మంత్రి ఎర్రబలి దయాకర్ రావు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, గిరిజన స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఫిబ్రవరి 23న జిల్లాలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోనే మంత్రుల బృందం వచ్చేందుకు గన్పూర్ మం డలంలో హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నామని, వీరు పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేం దుకు ప్రతి కార్యక్రమం వద్ద జిల్లా అధికారులు నోడ ల్ అధికారిగా నియమిస్తామని అన్నారు. వారు స్థానిక అధికారులు ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పలువురు మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచిం చారు. జిల్లాలో హెలిపాడ్ వద్ద నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని, మంత్రుల బందం తో వచ్చే ఉన్నతాధికారులు, ఇతర సహాయ సిబ్బంది స్థాని కంగా అవసరమైన భోజన వసతి ఇతర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఫిబ్రవరి 23న కేటీఆర్ మంత్రుల బృందం జిల్లాలో ఘన్పూర్ మండలంలో తహసిల్దార్ కార్యాలయం, నూతన బీసి హస్టల్ భవన ప్రారంభోత్సవం, మంజూరు నగర్లో సింగ రేణి సంస్థ ఆధ్వర్యంలో కార్మికుల సౌకర్యార్థం రూ.210 కోట్లతో నిర్మించిన 900 క్వార్టర్లను , రూ.3 కోట్లతో నిర్మించిన ఆర్అండ్బీ ప్రభుత్వ అతిధి గృహం, 23 లక్షలతో నిర్మించిన దివ్యంగుల కమ్యూ నిటీ భవనం, భాస్కర్ గడ్డలో పేదల కోసం నిర్మించిన 994 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారన్నారు. సుభాష్ నగర్ కాలనీలో రూ.4.5 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. మున్సిపాలిటీలో రూ.12 లక్షలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయం వీధి వ్యాపారుల కోసం నిర్మించిన స్ట్రీట్ వెండార్స్ మార్కెట్నుప్రారంభిస్తారని అన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో జిల్లాలో చేపడుతున్న పలు సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు వివరాలు తెలుసుకొని , రుణాలు, పట్టాలు పంపిణీ చేయనున్నారని తెలిపారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వివరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో జరుగు తున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు సజావుగా జరిగేలా అధికారులంతా కట్టుదిట్టంగా పనిచేయాలని ఆదేశించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వచ్చే మంత్రుల బృందానికి జిల్లాలో ఘన స్వాగతం పలకాలని, జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో నిర్వహించే సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం, అడిషనల్ కలెక్టర్ టి.ఎస్ దివాకర,సింగరేణి జనరల్ మేనేజర్ బల్లారి శ్రీనివాస్, రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాస్,జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి పురుషోత్తం, పంచాయతీ రాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, బీసి సంక్షేమ శాఖ అధికారిని శైలజ, తహసిల్దార్ లు ఇగ్బాల్,సతీష్ ఎంపీడీఓ అరుంధతి, ఇంచార్జ్ కమిషనర్, అవినాష్,ఆర్ అండ్ బీ డీఈ రమేష్ పాల్గొన్నారు.