Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ సభను విజయవంతం చేయాలని వరంగల్ జెడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కోరారు. సోమవారం భూపాలపల్లి మున్సిపల్ పరిధి 30వ వార్డు రెడ్డి కాలనీలో డప్పుచప్పుళ్లతో ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెట్టి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 23న మంత్రి కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు అభివద్ధి పనులను ప్రారంభించి, శంఖుస్థాపనలు చేస్తారని, అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే కేటీఆర్ సభను 50వేల మందితో సక్సెస్ చేస్తామన్నారు. కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి నేడు నియోజకవర్గంగా, జిల్లా కేంద్రంగా ఎంతో అభివద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తరువాత అత్యంత అభివద్ధి చెందిన ప్రాంతం భూపాలపల్లి అని అన్నారు. మంత్రి కేటీఆర్ వచ్చి ఇచ్చే వరాలతో భూపాలపల్లి అభివద్ధిలో మరింత పరుగులు పెడుతుందన్నారు. భూపాలపల్లి మున్సిపల్ పరిది ప్రతి వార్డు నుండి 500 నుండి 1000 మందితో సుమారు 20వేల మందిని తరలించాలని సూచించారు. జనాభ తరలింపులో ప్రతి వార్డులో వార్డు కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు పూర్తి బాద్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, బీఆర్ఎస్ పార్టీ అర్భన్ అద్యక్షుడు కటకం జనార్ధన్ పటేల్, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్‌కుమార్, కౌన్సిలర్లు మాడ కమల లక్ష్మారెడ్డి, మేకల రజీత మల్లేష్, ముంజాల రవీందర్, పానుగంటి హరీక శ్రీనివాస్, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి మాజీ పట్టణ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, 30వ వవార్డు అద్యక్షుడు కేటీ చిత్రంజన్, నాయకులు బీబీచారి, తాటీ అశోక్ గౌడ్, సింగనవేణి చిరంజీవి యాదవ్, కరీం తదితరులు పాల్గోన్నారు.
విజయవంతం చేయాలి : గండ్ర జ్యోతి
చిట్యాల : ఈనెల 23న మంత్రి కేటీఆర్ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షులు ఆరేపల్లి మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ పరిధలో పలు అభివద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు కేటీఆర్ వస్తున్నాడని, సభను విజయవంతం చేయాలని కోరారు. మండల ఇన్చార్జిలు కొలుగురి రాజేశ్వరరావు, తాళ్లపల్లి దామోదర్‌గౌడ్, జెడ్పీటీసీ గొర్రె సాగర్, ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు తౌటం నవీన్ ,పిఏసీఎస్ వైస్ చైర్మన్ ఎరుగొండ గణపతి, మండల పరిషత్ వైస్ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, కో ఆప్షన్ రాజ్ మోహమ్మద్, మండల ప్రధాన కార్యదర్శులు ఎరుగొండ రాజేందర్, మడికొండ రవీందర్ రావు, మెరుగు సంపత్ , తదితరులు పాల్గొన్నారు.