Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ జిల్లా అధ్యక్షులు రామచందర్ రావు
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్రంలో అమలవుతున్న ప్రతీ సం క్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా సింహబాగాన ఉందని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రం కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తూ రాజకీయ పబ్బ గడుపుతున్నారని, సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిది అన్న చందంగా వ్యవహ రిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వొద్దిరాజు రామచందర్ రావు ఆరోపించారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని భగత్‌నగర్‌లో ప్రజా గోస-బీజేపి భరోసా యాత్రలో బాగంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ శక్తి కేంద్రం ఇం ఛార్జి పరుపాటి రాం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ మానుకోట జిల్లా అధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం అధిక శాతం నిధులు మంజూరు చేస్తూ ఎలాంటి వివక్ష లేకుండా టీమిండియా స్పూర్తితో చిత్తశుద్ధి తోడ్పాటు అందిస్తున్నారని తెలి పారు. రాష్ట్రంలో నియంత్రత్వ, అహంకార పాలనకు చరమగీతం పాడి రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో పేదల ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని జోస్యం చెప్పా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమ య్య, పాకనాటి ధామోధర్ రెడ్డి, తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా నాయకులు పూసాల శ్రీమాన్, గంధంరాజు,మంగళపళ్ళి యాకయ్య,నూకల నవీన్, శివ, సుబ్రహ్మణ్యం, బూతం నర్సింహులు ,పేర్ల వెంకన్న, పేర్ల తిరుపతి, గంధం వీరయ్య, పవన్, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.