Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో మంగళవారం అంత ర్జాతీయ మాతభాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సుభాషిని దేవి సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలవేసి, మాతభాషా దినోత్సవ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. ఎం జె బి పి లో విద్యార్థులచే భువన విజయం ప్రదర్శనను నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కన బరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బందం, విద్యార్థులు పాల్గొన్నారు.
పర్వతగిరి : మండలంలోని చింత నెక్కొండ గ్రామం విజ్ఞాన భారతి విద్యాలయంలో మంగళవారం అంతర్జాతీయ మాతభాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో బాగంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యా సం పద్యాలు చదవడం, కవితలు రాయడం, కథలు చెప్పడం మొదలగు అంశాల లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అక్కినపెల్లి సతీష్ కుమార్ మాట్లాడుతూ సరైన భావ వ్యక్తీకరణకు మాతృభాష ఎంతో అవసరమన్నారు. ఇతరభాషలు ఎన్ని నేర్చు కు న్నా మాతృభాషను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపా ధ్యాయులు రజిత, సుమలత, పాషా, సంపత్ బిక్షపతి, నవీన్, శ్రీకాంత్, సరిత, శిరీష మౌనిక, పద్మావతి రాజేశ్వరి ఇతరులు పాల్గొన్నారు.
ఎన్జీవోస్ కాలనీ : 24వ అంతర్జాతీయ భాషా దినోత్సవాన్ని వడ్డేపల్లిలోని పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాలలో (స్వయంప్రతి) మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రధానాచార్యులు లెఫ్టినెంట్ ఆచార్య బత్తిని చంద్రమౌళి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆకునూరి విద్యాదేవి ముఖ్యవక్త గా పాల్గొన్నారు. అధ్యక్ష ఉపన్యాసంలో ఆచార్య బి.చంద్రమౌళి మాట్లాడుతూ ప్రస్తుత పోటీప్రపంచంలో ప్రపంచీకరణ వేగంగా జరుగుతున్న విధానంలో ఇతర భాషలను తప్పని పరిస్థితుల్లో నేర్చుకోవలసి వస్తుందని తెలుపుతూ అవసరానికి పరభాషలను మాట్లాడినప్పటికీ మన మాతృభాషను మాత్రం మనం ఎప్పటికీ అశ్రద్ధ చేయవద్దని తెలిపినారు. ముఖ్య వక్తగా వచ్చిన డాక్టర్ ఆకునూరి విద్యాదేవి మాట్లాడుతూ మాతృభాషలో అధ్యయనం వలన మెదడు వికసించి జ్ఞానాభివృద్ధి అవుతుందని, ఎవరి మాతృభాష వారిదని, అందరి భాషలను గౌరవించాలని సూ చిం చారు. కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ ఎం.శ్యామల మాట్లాడుతూ తెలుగు భాషలోని పలుకుబడులను, నుడికారాలను వివరించి, మాతభాషగా తెలు గు గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. సుహాసిని, పరీక్షల నియంత్రణ అధికారులు డాక్టర్ బి.రామకష్ణారెడ్డి, డాక్టర్ రేణుక, శిరీష, అకాడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ మాధవి, డాక్టర్ డి.పార్వతి, హిందీ విభాగాధిపతి డాక్టర్ అనంతలక్ష్మి, తెలుగు సహాయచార్యులు డాక్టర్ కపిల భారతి, శ్రీమతి ఎస్.రజిత, డాక్టర్ విజయలక్ష్మి, టి.రజిత, విద్యార్థినులు పాల్గొన్నారు.