Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
ఎన్నికల ముందు ఇచ్చినహామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రభు త్వం కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకుంటుందని బిజెపి జిల్లా ఉపాధ్యక్షు లు రాయరాకుల మొగిలి అన్నారు. మండలంలోని కాట్రపల్లి గ్రామంలో శక్తి కేంద్ర ఇంచార్జ్ కొత్తపల్లి శ్రీకాంత్ అధ్యక్షతన మంగళవారం కార్నర్ సమావేశం ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా మొగిలి పాల్గొని మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మశాన వాటిక, మరుగుదొడ్లు, ఉజ్వల గ్యాస్, పల్లె ప్రకతి వనం, ఉపాధి హామీ పథకం, ఉచిత రేషన్ బియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో చాలామంది నిరుపేదలు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తే నిరుపేదలకు తక్కువ డబ్బుతో మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు, బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో బూత్ అధ్యక్షులు జంగా సదయ్య, సంతోష్, శంకర్, విద్యాసాగర్, దేవరాజ్, మహేష్, నాగరాజు, రాజు, నవీన్, శేఖర్, సుమన్, సాంబయ్య, ఐలయ్య, రాజు పాల్గొన్నారు.