Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తూర్పులో కొనసాగిన రేవంత్ రెడ్డి పాదయాత్ర
- తూర్పులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి / వరంగల్
తెలంగాణ రాష్ట్ర ఇంచినోల్లకు ఒక్క అవకాశం ఇచ్చి వరంగల్ తూర్పు నియో జకవర్గంలో రాబోయే ఎలక్షన్లలో కొండా సురేఖని గెలిపించాని టిపిసిసి అధ్యక్షు డు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా ఎంజీఎం కూడలిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన, మాజీ మం త్రి కొండా దంపతుల సమక్షంలో మంగళవారం సాయంత్రం కొనసాగింది. యా త్రలో బాణసంచా తరజువ్వలు వెలుగులు ఆకాశంలో విరజిల్లాయి.పోచమ్మ మైదా న్ కూడలి నుండి వరంగల్ చౌరస్తా నుండి గుర్రం బగ్గీ లో పోస్టు అఫీస్ కూడలికి చేరుకున్నారు. టిపిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి గజమలను వేశారు. అంతరం కాంగ్రెస్ యువ నాయకురాలు సుస్మిత పటేల్ మాట్లాడుతూ వరంగల్ తూర్పులో కొండా సురేఖను గెలిపించుకోవడం సురక్షితమన్నారు. అనంతరం మాజీ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వరంగల్ తూర్పుకు రావడంతో ఎర్రబెల్లి దయాకర్ లాగుల తడిసిపోయాయని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ ఒక్క తల్లి తం డికి పుట్టినాను. ఎప్పటికీ టిడిపిని వీడనని అన్నారు. ఇప్పుడు ఎందుకు ఎర్రబెల్లి ద యాకర్‌రావు టీడీపీని వీడి బీఆర్ఎస్లో ఎందుకు కలిశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే తూర్పులో అభివృద్ధి జరిగిందని అన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్ గెలు స్తుందని చెప్తుంటే దాడులు, దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అనంతరం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొండ సురేఖ మురళి నేతత్వంలో తూర్పులో కాంగ్రెస్ జెండా ఎగరడంఖాయమన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న చారిత్రాత్మకమైన వరంగల్ సమ్మక్క-సారక్క తిరుగుబాటు ఉంది అతి రథ మహనీయులు దేశనిర్మాణంలో తమవంతుపాత్ర పోషించారు. కానీ 2014 లో వరంగల్‌కు గ్రహణం పట్టింది. కొత్తవాడ పద్మశాలీలునేసిన దర్రిస్ నగిషి లకు గొప్పపేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో నియామకం బోధన సిబ్బంది లేరు మౌలికమైన వసతులు కరువయ్యాయి అన్నారు. ప్రభుత్వ భూము లు చెరువుల ప్లాట్లను బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు కబ్జా చేస్తున్నారు. విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నా రు. వందలాది బిడ్డలు ఆత్మబలిదానం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఎమ్మె ల్యేలు భూకబ్జాలు చేసి కోట్లకు పడగ ఎత్తుతున్నారన్నారు.
దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, మైనారిటీలకు 12 శాతం రిజ ర్వేషన్ ఇస్తామని ఇంటికో ఉద్యోగం అని డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామని హామీ లు హామీలిచ్చి కేసీఆర్ మోసం చేశాడని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. బెల్ట్ షాపులను రద్దు చేస్తాం దీపంపథకం అమలు చేస్తాం. రూ.500 కు గ్యాస్ సిలిండర్ ఇస్తాం. ఉద్యోగులంద రికీ పాత స్కీం పద్ధతిలో పెన్షన్లు అమలు చేస్తాం న్యూ పెన్షన్ రద్దు చేస్తాం. పేద లకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తాం, రూ.2 లక్షల వరకు రైతులకు రుణ మాఫీ చేస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.