Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
హిజ్రాలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని తెలంగాణ ట్రాన్స్ జెండర్ అధ్యక్షురాలు లైలా అన్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహబూబాబాద్ లో హిజ్రాలను కించపరిచేలా కొజ్జాలు అంటూ సంబోధించడానికి నిరసిస్తూ ట్రాన్స్ జండర్లతో కలిసి పోస్ట్ఆఫీస్ కూడలిలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వైయస్ షర్మిల డౌన్‌డౌన్ అంటూ షర్మిల చిత్రప టాన్ని దహనం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిజ్రాల కమ్యూ నిటీని కించపరిచేలా బోధించడం షర్మిలకు మంచిది కాదని చిన్న చూపుకు గురవు తున్న హిజ్రాల పట్ల సానుభూతితో ఉండాలి కానీ కొజ్జాలు అంటూ సంబో ధించడం ఆమెకు శ్రేయస్కరంకాదని మండిపడ్డారు. హిజ్రాల సమాజానికి బేషర తుగా వైయస్ షర్మిల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హిజ్రాల సంఘం జాయింట్ సెక్రటరీ రంజిత, రేష్మ, సుధా ప్రియాంక, అశ్విని, అంజు, రేణుక, తదితరులు పాల్గొన్నారు.