Authorization
Sun April 13, 2025 12:33:53 am
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
నవతెలంగాణ-శాయంపేట
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ని అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 23న నిర్వహించనున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బహిరంగ సభకు మండలం నుండి బిఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని రైతువేదికలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్త లు సన్నాహక సమావేశం మంగళవారం పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనో హర్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొ ని మాట్లాడుతూ ఈనెల 23న జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో పలు అభివద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖమంత్రి, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్పకుంట్ల తారక రామా రావు పాల్గొంటున్నారని, అనంతరం అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు మండలం పరిధిలోని గ్రామాల పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాంశెట్టి లతాలక్ష్మారెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ మారేపల్లినందం, సర్పంచ్ కందగట్లరవి, ఎంపిటిసి బాసాని చంద్రప్రకాష్ పాల్గొన్నారు.