Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుండాల మాదిరిగా భౌతిక దా డులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని మండల కాంగ్రెస్ యూత్ నాయకులు మారపల్లి కట్టయ్య హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ హన్మకొండలో సోమ వారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్రలో జిల్లా యూత్ నాయకుడు తోట పవన్‌పై బిఆర్ఎస్ గుండాలు దాడి చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తు న్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగి పోయిందని, ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే బిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పాద యాత్రలో ప్రజల నుండి పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే అ నుచరులు కాంగ్రెస్ యూత్లీడర్పై దాడి చేయడం హేయమైన చర్యగా అభివ ర్ణించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో భౌతిక దాడులు పెరి గాయని, ఇకనైనా తమ పద్ధతి మార్చుకోవాలని హితువు పలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాక బిఆర్ఎస్ అక్రమార్కుల భరతం పడతామని, అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలకు వత్తాసుపలుకుతున్న అధికారులను కూడా వది లిపెట్టమని హెచ్చరించారు. ఇలాంటి భౌతిక దాడులు పునరావతమైతే తీవ్ర పరి ణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయ కులు రజినీకాంత్, సుకుమార్, మొగిలి పాల్గొన్నారు.