Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కమ్యూనిస్టు మేనిఫెస్టో ఏర్పడి నేటికి 150 సం వత్సరాలు పూర్తి చేసుకున్నదని ప్రపంచవ్యా ప్తంగా ఈరోజును రెడ్బుక్డేగా పెద్దఎత్తున నిర్వహించు కో వడం జరుగుతుందని సీపీఐ(ఎం) రంగసాయిపేట ఏరియా కార్యదర్శి మాలోత్ సాగర్ అన్నారు. ఖి లా వరంగల్ మండలం రంగసాయిపేట ఏరియా శాఖ ఆధ్వర్యంలో జొక్కలోద్ది, బెస్తంచెరువు గుడిసె సెంట ర్లలో రెడ్ బుక్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2000 పైచిలుకు ప్రజలకు భారత విప్ల వకెరటం భగత్‌సింగ్ పుస్తక పఠనం సామూహి కం గా ఒకేచోటున కూర్చొని చేయించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో సాహిత్య పఠ నం ద్వారా ఏది మంచో ఏది చెడు తెలుసుకోవ డం జరుగుతుందని నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ భగ త్ సింగ్ చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. నేటి పాలకులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చి చ్చు పెడుతున్నారని మండిపడ్డారు. గోవింద్ పన్సారే మతోన్మాదానికి వ్యతిరేకంగా అసమానతానికి వ్యతిరే కంగా రచనలు చేశారని ఆయనతోపాటు మరింత మంది రచయితలు రచనలు చేశారని అన్నారు.
బీజేపీ ప్రభుత్వంలో మతోన్మాద శక్తులు వామప క్ష భావజా లాన్ని ప్రచారం చేసే రచయితలతో పాటు ప్రింటింగ్, ప్రచురణ కర్తలతో పాటు జర్నలిస్టుల పైన కూడా దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యా ప్తంగా సామ్రాజ్యవాద శక్తులు కమ్యూనిస్టు సాహిత్యా న్ని సహించలేని పరిస్థితుల్లో ఉన్నాయని దానికి తా ర్కానమే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల పైన జరు గుతున్న దాడులను అన్నారు. నేటి పరిస్థితులను దష్టిలో పెట్టుకొని ఈ సాహిత్యాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్లాలని అందుకు ప్రతి ఒక్కరు సాహిత్యాన్ని చదివి నాటివిప్లవ వీరుల త్యాగాలను తెలుసుకోవా లన్నారు. ఫిబ్రవరి 21న వరల్డ్ బుక్ డే గా ప్రకటించి ఢిల్లీ లోని లెఫ్ట్ వరల్డ్ బుక్ సంస్థ రెడ్ బుక్ డేను జరు పుతుందని గుర్తు చేశారు. కమ్యూనిస్టు ప్రణాళికలో భాగంగా రచించి ఆరోజునే విడుదల చేసి ప్రపంచ వ్యాప్తంగా అన్ని శక్తులను ఊరట ఇచ్చిందని విముక్తి కోసం కమ్యూనిస్టు ప్రణాళిక ఒక మార్గాన్ని ప్రపం చానికి చూపెట్టిందని పెట్టుబడిదారీ వ్యవస్థను నాశ నం చేసి సోషలిజం వైపు ప్రజలను మళ్లించేందుకు మార్గాలను సుగుణంచేసిందని అన్నారు. ఈ కార్యక్ర మంలో మాలోతు ప్రత్యూష, సాంబమూర్తి, గానే పాకఓదేలు, సందీప్, చందులు పాల్గొన్నారు.
మత రాజ్యాలు నిర్లజ్జ దోపిడి కేంద్రాలు : ఎం.చుక్కయ్య
ఐనవోలు : మత రాజ్యాలు నిర్లజ్జ దోపిడి కేం ద్రాలుగా మారి ఈ దేశ సంపదలను పెట్టుబడిదారు లైనా ఆదాని, అంబానీలకు బిజెపి మోడీ ప్రభుత్వం దోచిపెడుతుందని సీపీఎం జిల్లా నేత ఎం.చుక్కయ్య కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.మంగళవారం మండలం వెంకటాపురంలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రెడ్ బుక్ డే సభ పార్టీ మండల కమిటీ సభ్యులు ముల్కల గూడెం సర్పంచ్ బండి పర్వతాలు అధ్యక్షతన నిర్వహించారు. భారత విప్లవ కెరటం భగత్ సింగ్ పుస్తక ఆవిష్కరణ చేసిన అనంతరం చుక్కయ్య మాట్లాడుతూ భారత స్వతంత్ర సమరయోధుల్లో విప్లవకారులు, సోషలి స్టులలోను అగ్రశ్రేణికి చెందిన వారిలో భగత్‌సింగ్ ఒ కరు మన దేశంలో మొట్టమొదటి మార్క్సిస్ట్ సిద్ధాంత ఆలోచన పరులలో భగత్‌సింగ్ ఒకరు స్వతంత్ర పో రాటంలో ఈదేశం నుండి బ్రిటిష్ వారు వెళ్ళిపోవాల ని పార్లమెంటుపై బాంబువిసిరిన మతతత్వానికి, మ తోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటంచేశారు.ఈ పోరా టాన్ని జీర్ణించుకోలేని బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ ను అరెస్టు చేసి రాజద్రోహం కింద తన 23 ఏళ్లలోనే భగత్‌సింగ్‌తో పాటు రాజగురువు సుగుదేవులను నా టి బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయించిందిని అన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి తర్వాత మతో న్మాదాన్ని రెచ్చగొడుతూ మతాల మధ్య కులాల మధ్య న చిచ్చులు రగిలిస్తూ ఈ దేశాన్ని అల్లకల్లో చేస్తుందని ఇలాంటి మతవున్మాదులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చుక్కయ్య పిలుపునిచ్చారు.
పార్టీ మండల కార్యదర్శి లింగయ్య మాట్లాడు తూ భగత్‌సింగ్ స్వతంత్ర పోరాటం తో పాటు సా మ్రాజ్యవాదానికి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారన్నారు. నేటి యువత భగత్ సింగ్‌ను ఆ దర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని యువతకు లింగయ్య పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యు లు గుండెకారి మహేందర్,కొంకల నారాయణరెడ్డి, దీకొండ ఉప్పలయ్య, కొంకటి శంకర్ రెడ్డి, మోహన్ రావు, రాయపురపు కొమురయ్య, బాబురావు, సలీం, సంతోష్, మచ్చ కుమార్, నాగరాజు, మాజీ సర్పంచ్ మాణిక్యం, సరోజన, సజన, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.