Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్
జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవం తంగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అభివృద్ధి పనుల పురోగతి డివిజన్లవారిగా అధికారులతో కూలంకశంగా సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయు టకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మహా నగరం లో పట్టణ ప్రగతి, జనరల్ఫండ్, సిఎంఏ, ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్, తదితర పథకా ల క్రింద కొనసాగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు టెండర్ అయిన పనులను తక్షణమే ప్రారంభించాలని, ఇంకను మిగిలియున్న వాటికి వెంటనే టెండర్ ప్రక్రియపూర్తి చేయాలన్నారు.కాంట్రాక్టర్లుసకాలంలో చేయని పక్షంలో ఆయా పనులను రద్దు చేయాలని, రద్దు చేసిన పనులకు జాప్యం జరుగ కుండా వెంటనే తిరిగి టెండర్ పిలవాలని సూచించారు. ఈ సమీక్షలో ఎస్ఈ కృష్ణరావు, డీఈలు రవి కుమార్, నరేందర్, సంతోష్ బాబు, రవి కిరణ్, సారంగంలు పాల్గొన్నారు.