Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి
నవతెలంగాణ-కాజీపేట
పారిశ్రామిక ప్రాంతాలలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి అన్నా రు. పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల సర్వే లో భాగంగా సిఐటియూ హనుమ కొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాజీపేట, రాంపూర్ ఇండిస్టియల్ ఏరియాలో పారిశ్రామిక కార్మికుల స్థితిగతులపై మంగళవారం సర్వే నిర్వహించడం జరిగిం ది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి మాట్లా డుతూ పారిశ్రామిక ప్రాంతంలోని పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని, ఇండ్లు లేని నిరుపేద కార్మికులకు ప్రభుత్వమే ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లనిర్మాణం నిర్మాణం చేపట్టాలన్నారు, వలస కార్మి కులకు సంబంధించిన చట్టాలను అమలు చేయాలి, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కార్మికుల వేతనాలను సవరించడం లేదని, ఇటీవల కాలంలో ఐదురంగాలకు రాష్ట్రప్రభుత్వం కనీసవేతనాలు సవరించినప్పటికీ యజ మాన్యాల ఒత్తిడితోపక్కన పెట్టారన్నారు. పరిశ్రమలో దాదాపు సగానికంటే మించి వలస కార్మికులతో పనిచేస్తున్నారని 8గంటల పనికి బదులు12 గంటల పని అ మలు జరుగుతుందని, ప్రభుత్వం వెంటనే పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులకు చట్టాలన్నీ అమలు చేసే విధంగా లేబర్ అధికారులపై బాధ్యత పెరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుందన్నా రు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు గడ్డం అశోక్, భద్రయ్య, రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.