Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
పేదలు ఇండ్ల స్థలాలు దక్కేం తవరకు పోరాటం నిర్వహించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీ య ఉపాధ్యక్షులు జీ.నాగయ్య పిలుపు నిచ్చారు. మంగళవారం మహబూబాబాద్ పట్టణ శివారు లో పేదలు వేసుకున్న గుడిసె వాసుల సమావేశం సీపీఎం పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాంనాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాగయ్య మాట్లాడా రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చే నమ్మకం లేదని పేదలు పోరాడి సాధించుకోవాలని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చి న హామీలన్నీ నెరవేర్చే అంతవరకు దశలో వారీగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ 50 ఏళ్ల లో ఎర్రజెండా మాత్రమే పేదలకు ఇళ్ల స్థలాలు పంచిందని ఏ ప్రభుత్వం పేదవా డికి అండగా లేదని అన్నారు. దున్నేవాడికి భూమి ఉండేవాడికే ఇల్లు దక్కింద న్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కుర్ర మహేష్, సమ్మెట రాజమౌళి, పట్టణ కమిటీ నాయకులు అల్లి శ్రీనివాసరెడ్డి, చీపిరి యాకయ్య, దేవత్ హేమ నాయక్, కుమ్మరికుంట నాగన్న, భానోత్ ప్రకాష్, ఎస్.వెంకటేశ్వర్లు, మచ్చ వెంకన్న, మోతిలాల్, అశోక్, భూక్య శీను, రాజేష్, యార్వ రాము, తానేష, ఉమేష్, నాగమ్మ, సురేష్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.