Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
బయ్యారంలో ఈనెల 23వ తేదీన క్యాన్సర్ పై ప్రత్యేక క్యాంపు నిర్వహించను న్నట్లు డీఎంహెచ్‌వో హరీష్ రాజ్ తెలిపారు. మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కాన్సర్ స్క్రీనింగ్ పై సమావేశం నిర్వహించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ హిస్పిటల్, రోటరీ క్లబ్ బంజారా హిల్స్, డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ సర్వైకల్ క్యాన్సర్‌పై 23 తేదీన బయ్యారంలో 14 మంది బృందంతో క్యాన్సర్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో నలుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొంటారని, 4వ తేదీన బయ్యారం మండలం గంధంపల్లిలో ఇదే క్యాన్సర్ బృందంచే క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎంహెచ్వో తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఉమాగౌరీ, డాక్టర్ అంబరీష్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధీర్ రెడ్డి, బయ్యారం ఎమ్మార్వో, ఎంపీడీవో, వైద్యాధికారులు డాక్టర్ విజయకుమార్, డిపిఓ రుక్మౌద్ధిన్, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్, ఇన్చార్జి డిప్యూటీ డెమో కెవి.రాజు పాల్గొన్నారు.