Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న వ్యవసాయ అధికారులు
నవతెలంగాణ- దంతాలపల్లి
మండలంలోని రైతులకు యురియా కష్టాలు తప్పడం లేదు. దుకాణదారులు చెప్పిందే వేదంలా అధికారుల తీరు ఉన్నదని మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 17 గ్రామాలతో పాటు శివారు తండాల్లో యసంగి సీజన్లో వివిధ రకా ల పంటలు సాగు చేశారు.వరి పొలాల్లో కలుపు పను లు పూర్తవడం. మిర్చి, వేరుశనగ, మొక్కజొన్న, పంట లకు ఎరువులు వేసే సమయం కావడంతో రైతులు యూరియా కోసం మందుల దుకాణాల బాట పడు తున్నారు. దంతాలపల్లి ఎరువుల దుకాణాల్లో సరిపడ యూరియా లేదని దుకాణదారులు చెప్పుతుండడం తో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని దుకాణాల్లో యూరియా ఉన్నప్పటికీ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రైతులు అరపిస్తున్నారు. బస్తాకు రూ.266.50కు విక్రయించాల్సి ఉండగా హమాలికి రూ.6 చొప్పున రూ.272 చొప్పున విక్రయిస్తున్నారు. కొందరు దుకాణదారులు రూ.300 దాకా విక్రయిస్తు న్నారని రైతులు మండి పడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే యూరియా విక్రయాలు జరపాల్సి ఉన్న దుకాణదారులు అవేమీ పట్టించుకోకుండా అధి క ధరలకు విక్రయిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తు న్నారు. మరికొందరు ఇతర రకాల పురుగుల మందు లు తీసుకుంటేనే యూరియా ఇస్తామంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మంగళవారం స్థానికంగా ఉన్న ఓ ఎరువుల దుకాణం వద్ద లారీలోడు ఉన్నదని రైతులు వెళ్తే మాత్రం రేపు రా పో... మపు రాపో.... అంటూ దాట వేసే ధోరణిలో ఉన్నారని రైతులు వ్యవసాయ అధికా రులకు ఫోన్ సమాచారంతో అడిగినా కూడా అలానే ఉంటుంది. రేపు అని ఎరువుల యజమానులకు వత్తాసు పలకడంతో రైతులు ఏం చేయలేని స్థితిలో అధిక ధరలకు ఎరువులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పై అధికారులు, ప్రజా ప్రతి నిధులు స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.
నా నుంచి రోగాలు మొదలయ్యాయి : దిడ్డి వెంకన్న రైతు
ఈ సారి ఏసంగిలో నాకున్న 25 ఎకరాల పొలంలో వరి నాటు సాగు చేశాను. నాటు వేసే సమయానికి నారుమల్లకే రోగం వచ్చింది. చీడపీడ లు సోకి సగం నారు పాడయింది. ఉన్న కొద్దిపాటి నారుతో పొలం సాగు చేశాను. నాటేసి నెల గడుస్తున్నప్పటికీ ఎలా వేసిన నాటు అలానే ఉండిపో యింది. దీంతో మందుల దుకాణాల యజమానులు చెప్పిన మందులను పలుమార్లు పిచికారి చేశాను. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. సమయానికి ఎరువులు వేద్దామ ని యూరియా కొరకు వెళితే ఎరువుల దుకాణదారులు ఇష్టంవచ్చినట్లు అధిక ధరలు వసూలు చేస్తూ, సమయానికి ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ అధికారి బి.చత్రు నాయక్
ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి బి.చత్రు నాయక్ వద్ద 'నవతెలంగాణ' ప్రస్తావించగా దం తాలపల్లిలో యూరియా కొరత లేద న్నారు. యూరియా కొరత లేకుండా చూడడానికి దంతాలపల్లి మండలానికి స్వయంగా తనే వచ్చి యూరియా కొరత లేకుండా చూసి సంబంధిత అధికారులు, షాపు యజమానులపై చర్యలు తీసు కుంటామనీ అన్నారు.