Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-నెల్లికుదురు
ఉపాధి హామీ బడ్జెట్ తగ్గించడానికి కేంద్ర ప్రభు త్వం కుట్ర చేస్తున్నందున స్థానిక సమస్యల సాదనకై పొరాటాలకు ప్రజలను సిద్ధం చేయడమే సీపీఎం లక్ష్యం అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగ య్య అన్నారు. మండల కేంద్రంలో నెల్లికుదురు మం డల కమిటీ సమావేశంను స్థానిక విశ్రాంతి భవనం లో తోట నరసయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా సమావేశానికి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పేద లను ఆర్థిక దోపిడి చేసే విధంగా ఉందని అన్నారు. ఉపాధి హామీ గత సంవత్సర బడ్జెట్ 135 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం బడ్జెట్లో కేవలం 65 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించడం వలన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలి ఇప్పిస్తా నని ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పడం తప్ప ఆచ రణలో అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమైందని, తెలంగాణలో 30 లక్షల ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారని వారికి ఎనిమిది సంవత్సరాల కాలంలో లక్ష చిల్లర ఇండ్ల నిర్మాణం చేసారు. కానీ అవి కూడా అగమ్య గోచరంగా మిగిలిపోయాయని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పడం తప్ప ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, బ్యాంకు రుణాలు రైతులకు సకాలంలో అందించడంలో ప్రభు త్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, రైతు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇవ్వడం లేదని, రుణమాఫీ చేస్తానని ఇంతవరకు కూడా చేయలేదని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే ఏమా త్రం శ్రద్ధ చూపడం లేదని, భూ అక్రమణా దారులకు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతు న్నారని ఆయన దుయ్యపట్టారు. తక్షణమే పోడు భూ ములకు పట్టాలు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, రైతులకు బ్యాంకు రుణాలు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేస్తున్న మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపి ప్రజా వ్యతి రేక విధానాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అమలు చేయని యెడల ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తా మని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుణగంటి రాజన్న, మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్, మండల నాయకులు ఇస్సంపెల్లి సైదులు,బాబు గౌడు పెరుమల్ల పుల్లయ్య సమ్మయ్య యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.