Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల హక్కుల సాధనకై పోరాడాలి
- కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయాలి
- ఐఎఫ్టియూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే.సీతారామయ్య
నవ తెలంగాణ-బయ్యారం
కార్మికవర్గం ఎన్నో పోరాటాల ద్వారా సాధించిన 44 కార్మిక చట్టాలు మోడీ ప్రభుత్వం ఒక్క కలం పోటుతో రద్దు చేసిందని దీని స్థానంలో తెచ్చిన 4 లేబర్ కోడ్లు భారత కార్మికవర్గానికి ఉరితాడు లాంటి వని రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుస రిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కు కొట్టేం దుకు కార్మిక వర్గం మరింత ఐక్యతను సాధించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.సీతారామయ్య పిలుపు నిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్.కె మదార్ అధ్యక్షతన జరిగిన ఐఎఫ్టి యూ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత కార్మిక సంఘాల సమా ఖ్య ఐఎఫ్టియూ మహబూబాబాద్ జిల్లా మహాసభ ను మార్చి 5న బయ్యారంలో నిర్వహిస్తున్నట్లు, రాష్ట్ర మహాసభను ఏప్రిల్ 2,3 లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరుపుతున్నట్లు తెలియజేశారు. కార్మికవర్గం అనుభవిస్తున్న కుల సాధన కోసం పోరా టాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రభుత్వరంగ పరిశ్రమలు అన్నింటిని బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని తెలిపారు. విమానాలు, ఎల్ఐసి, బ్యాంకులు, రైల్వేలు, బొగ్గు, స్టీల్, ఆయిల్ సంపద, ఖనిజ సంపదలను, దేశంలోని పంట భూ ములు, అడవులను అంబానీ ఆదానీలకు కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అప్పగిస్తున్నాడని తెలియజే శారు. హిడేన్ బర్గ్ నివేదిక దేశాన్ని, విదేశాల్లో సంపద ను ఆధానికి ఎలా కట్టపెట్టింది తేటతెల్లం అయ్యింద ని ఆరోపించారు. కార్మికుల్లో, దేశ ప్రజల్లో మత ఉన్మా దం చర్యల ద్వారా హిందుత్వ ఫాసిజాన్ని అమలు చేసేందుకు మోడీ, ఆర్ఎస్ఎస్ శక్తులు పూనుకున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారం లోకి వచ్చిన కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా మోడీ అడుగుజాడల్లో నడుస్తున్నాడని, తెలంగాణ ప్ర జలకు ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్ చేయలేదని, కొత్త పరిశ్రమలు తీసుకురా లేదని, బొగ్గు పరిశ్రమలో ఆంధ్ర కాంట్రా క్టర్ల దోపిడి రద్దుకాలేదని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ రాలేద ని, బొగ్గుగనుల అమ్మకానికి పెట్టిన కేంద్ర ప్రభుత్వా నికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి, మైనార్టీ, దళిత, కార్మిక, ఉద్యోగ వర్గాలకు, రైతాంగానికి వ్యతిరేకమైన విధానాలను అమలు చేస్తున్నదని వివరించారు. ఈ సమావేశంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు ఏపూరి వీరభద్రం, శివారపు శ్రీధర్, మాదంశెట్టి నాగేశ్వరరావు, బాలమల్లు, లింగయ్య, శో భన్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.