Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనువాదులకు రుచించక మనుస్మతిని రాజ్యాంగంగా తేవడానికి మతోన్మాద బీజేపీ కేంద్ర ,ప్రభుత్వం ప్రయ త్నిస్తున్న దుష్టత్వాన్ని తీవ్రంగా ఖండించాలని, లేకుంటే ఇది వేయి పడగల విషనా గుగా మారి కాటేసే ప్రమాదం పొంచి ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య అన్నారు. కేసముద్రం మండల కేంద్రంలోని హరిహర గార్డెన్లో మంగ ళవారం మార్తినేని పాపారావు అధ్యక్షతన జరిగిన సీపీఎం కేసముద్రం మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగయ్య మాట్లాడుతూ పాలక కేంద్ర, ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పోరేట్ శక్తులకు కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా, మధ్యతరగతి నిరుపేద, ప్రజానీకానికి కోతల బడ్జెట్‌గా నిలిచిపోయిందని ఈ బడ్జెట్ అత్యంత దుర్మార్గమని అన్నారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం కార్యకర్తలు, ప్రజా స్వామిక వాదులు, సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో పీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి, సాదుల శ్రీనివాస్, గునిగంటి రాజన్న మోడం వెంకటేశ్వర్లు, బొబ్బల యాకుబ్ రెడ్డి, కావటి నరసయ్య, చాగంటి కిషన్, తాడబోయిన శ్రీశైలం, జల్లే జయరాజ్,సావిత్ర,జాటోత్ వెంకన్న, గొడిశాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.