Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మాతృభాషలో భోధన,రచనలు మానవ జీవన వికా సానికి దోహదం చేస్తాయి అని శుభోదయం సాహిత్య సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు సంకెపల్లి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక బ్యాంక్ కాలనీలోని శుభోదయం కార్యాలయంలో శుభోదయం ఉపాధ్యక్షుడు టి.నరేందర్ అధ్యక్షతన జరిగిన కార్య్రమం లో శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ మాతృభాష తల్లి వంటిదని మాతృభాషలో ప్రతిభా పాట వాలు ఉంటే అన్యభాషలో ప్రావీణ్యం సంపాదించటం సులువు అని తెలిపారు. ప్రపంచ స్థాయి సాహితీవేత్తలు తమ మాతృభాషతో పాటు ఇతర భాషలలో ప్రావీణ్యం సంపాదించినవారే అను తెలిపారు.పివి నరసింహారావు, ఎన్‌టి.రామారావు, రవీంద్రనాథ్ ఠాగూర్, కెఆర్ నారా యణ్, సరోజినీదేవీ, అబ్దుల్ కలామ్ వంటి వారు దీనికి ఉదాహరణ అని తెలిపారు.1999లో బంగ్లాదేశ్ చేసిన డిమాండ్ మేరకు యునెస్కో నాటినుండి ఫిబ్రవరి 21వ తేదీను అంతర్జాతీయ మాతృభాష దినత్సవం జరుపుతు న్నారని తెలిపారు.దేశంలో సాంకేతిక విద్యలో, విశ్వ విద్యా లయ స్థాయిలో తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాష లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషా అభివృద్ధి మంత్రిత్వ శాఖ లేదా బోర్డును ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమం లో శుభోదయం ప్రతినిధులు లక్ష్మి కాంతారావు, బొడ్డుప ల్లి పాపయ్య, కె.జనార్ధన్, సంపత్, రమేష్, ఆచార్య, కవి త, మాధవి, కీర్తనారెడ్డి, భూమిక, అఖిల పాల్గొన్నారు.
దేవరుప్పుల : మంగళవారం అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రాని కి చెందిన శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాల వి ద్యార్థులు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు అక్షర రూ పంలో కూర్చొని మాతృభాష అభిమనాన్ని చాటుకు న్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరపాంటెండెంట్ టకూ రి పాండుకృష్ణ, ప్రిన్సిపల్ స్వప్న పాల్గొన్నారు.
జఫర్గడ్ : మంగళవారం మండలం కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు అంతర్జాతీయ మాతృభాష దినో త్సవం నిర్వహించారు. తెలుగు విభాగ బాధ్యులు కట్కూ రి డాక్టర్ మహేందర్, భూక్య నరేష్, ఆధ్వర్యంలో విద్యా ర్థులు ఉపన్యాసం, తెలుగు హ్యాండ్ రైటింగ్ పోటీలు నిర్వ హించి విజేతలకు బహుమతులు అందజేశారు.అమ్మ భాషనే మాతృభాష అనే అంశంపై శ్రీ గణేష్ కందగట్ల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఉపన్యాసం ఇచ్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొన్న ప్రిన్సిపల్ డీ.శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థు లకు మాతృభాషలో నైపుణ్యం సాధించాలని తెలిపారు. ఏ భాషను అర్థం చేసుకోవాలన్న మాతృభాషయేప్రధానమనీ వివరించారు. ఈ కార్యక్రమంలో జానీ, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, మనోజ్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : ఇనుగుర్తి మండల కేంద్రంలో సాంఘీక సంక్షేమ గురుకుల (బాలికల) పాఠశాల, కళాశా ల ప్రిన్సిపల్ అధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్య్రమంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీ, చిత్రీకరణ పోటీలు నిర్వహించి ప్రిన్సిపల్ రూపాస్ చేతు ల మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా డాక్టర్ శివరాం, ఆర్బి ఎస్కే బృందం పెద్దలు, మహబూబాబాద్, తెలుగు ప్రద ర్శనశాలను సందర్శించి విద్యార్థులకు బహుమతులు అం దజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌తో పాటు, వైస్ ప్రిన్సిపల్ బి. వెంకయ్య, తెలుగు ఉపాధ్యాయులు ఎస్. స్వప్న, వి.వెంకమ్మ, టి.సంగీత మరియు ఉపాధ్యాయు లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.