Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటికన్నే గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ మహాసభ
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
అసమానతలు లేని సమాజం కోసం అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వంకై ప్రతీ ఒక్కరూ పాటుపడాలని, పాలక వర్గాలు బహుజనుల అభివృద్ధికి కృషి చేయాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దళిత రత్న కామ సంజీవరావు అన్నారు. కేసముద్రం మండలం ఇంటికన్నే గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ మహాసభ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భం గా మహాసభలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మం డల కన్వీనర్ పోలేపాక నాగరాజు అధ్యక్షతన మహాసభ జరుగగా ముఖ్య అతిథిగా కామ సంజీవరావు మాట్లాడా రు. అసమానతలు లేని సమాజం కోసం పాటుపడిన మహానీయుడు అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ అం దించిన రాజ్యంగం, ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్య పద్దతిలో పదవులను అనుభవిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాల కులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాంగ యుతంగా వచ్చే ఫలాలు వారి ఇంట్లో వెలుగులు నింపే విధంగా అందించాలన్నారు. స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు, రాజ్యంగం అమలులోకి వచ్చి 72 సంవ త్సరాలు అవుతున్న దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహి ళలపై దాడులు ఆగడం లేదన్నారు. అంబేద్కర్ వాదం ద్వారానే దేశంలో నెలకొని ఉన్న అసమానతలను అడ్డుకో వచ్చన్నారు. రాష్ట్రంలో దళితులకు మూడేకారాల భూమి, దళిత బంధు ప్రతీ ఒక కుటుంబానికి ఇవ్వాలని, గిరిజన బంధును అమలు చేయాలని, బీసిబంధు ప్రకటించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీసీ హక్కులకై కోటి ఉత్తరాల ఉద్యమ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సామల నర్సయ్య, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి కొలిపాక వెంకన్న, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్య వర్గ సభ్యులు ఎన్ఎ.స్టాలిన్, అంబేద్కర్ యువజన సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిరుడు సామేల్, జిల్లా ఉపా ధ్యక్షులు మందుల కృష్ణమూర్తి, ఇంటికన్నే గ్రామ మాజీ సర్పంచ్ ఐతే సారయ్య, అంబేద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకులు చీపురు వెంకటేశ్వర్లు, మండల అడ హక్ కమిటీ సభ్యులు మిట్టగడుపుల యాకయ్య, మిట్ట గడుపుల బిక్షపతి, బానోతు బాలు నాయక్, సోమారపు మదర్, అంబేద్కర్ వాదులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంటికన్నే గ్రామ కమిటీ
గౌరవ అధ్యక్షులుగా అయిత సారయ్య, అధ్యక్షులు గా బేజ్జం శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షులు గడ్డం దయా కర్, ఎండీ కుర్బాన్ అలీ, ప్రధాన కార్యదర్శిగా అయిత భరత్ కుమార్, కార్యదర్శులుగా మిట్టగడుపుల జీవన్ కుమార్, సోమారపు శశివర్థన్, కోశాధికారి నిమ్మనగోటి సురేష్, కార్యవర్గ సభ్యులుగా మేడిపల్లి ఉమాపతి, చీపిరి కొమురయ్య తదితరులను ఎన్నుకున్నారు.