Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సర్పంచ్ శిరీష మంగీలాల్ అన్నారు. మంగళవారం మండలంలోని పగిడిపల్లి గ్రా మంలో పలు అంతర్గత రోడ్డు పనులను బీఆర్ఎస్ మండ అధ్యక్షులు రామ్ సింగ్, నాయకులు మూల మురళీధర్ రెడ్డిలతో కలిసి పనులను ప్రారం భించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాష్ట్రం సిద్ధించాక అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ఎమ్మె ల్యే డీఎస్ రెడ్యానాయక్ సహకారంతో నియోజకవర్గం అభివృద్ధిలో ముం దుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ధారా సింగ్, కేసముద్రం మార్కెట్ మాజీ డైరెక్టర్ చెన్నయ్య, కేసముద్రం మార్కెట్ డైరెక్టర్ శ్రీరాములు, వార్డు సభ్యులు గంధసిరి సింధుజ శ్రీపాల్, నాయకు లు వెంకన్న, మల్లయ్య బాలమల్లు, రమేష్, రవీందర్, యాకయ్య బిక్షం రెడ్డి, రాంరెడ్డి, రాముడు, కార్యదర్శి రోజా తదితరులు పాల్గొన్నారు.