Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇసుక లారీల యాజమానుల సంక్షేమ సంఘం
నవతెలంగాణ -హన్మకొండ
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కొందరు ఇసుక లారీల యజమానులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని వారి బారి నుండి రక్షించాలని ఇసుక లారీల యజమానుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఇసుక లారీల సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో బుధవారం వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం ముఖ్య నాయకులు రవి కిషోర్, శ్రీనివాస నాయుడు, చెంచు రాజు, ఇతర నాయకులతో కలిసి వారు మాట్లా డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక లారీ ఇసుక కు 14 వేల రూపాయలు డిడి చెల్లించాలని మిగతా ఖర్చులతో కలిపి రూ.20 వేలకు పైగా ఖర్చు అవుతుందని అన్నారు. కానీ లారీ అసోసి యేషన్ ముఖ్య నాయకులు దాదాపు పదిమంది సిండికేట్ గా తయారై కేవలం 11 వేల రూపాయలు అనధికారికంగా ఖర్చు చేసి దాదాపు రోజుకు 150 ట్రిప్పులు అంటే రూ.70 లక్షలు నెలకు రెండు కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార నాయకుల అండదండలతో టీఎస్ ఎండిసి చెక్ పోస్ట్, జమ్మికుంట, హుజురాబాద్, ఎలుకతుర్తి, హాసన్పర్తి, కేయూ పోలీస్ స్టేషన్లకు, జమ్మికుంట హుజురాబాద్ ఆర్టీవోలకు మామూలు ఇచ్చుకుంటూ దర్జాగా ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. నిబంధన ప్రకారం రూ.14000 చెల్లిస్తే 23 టన్నులు మాత్రమే ఇసుక తేవాలని, కానీ వారు అనధికారికంగా ఒక్క లారీలో 40 నుండి 50 టన్నుల ఇసుక తీసుకువస్తున్నారని అన్నారు. అక్రమ దందా చేస్తున్న వాహనాలన్నీ ఆర్టీవో టీఎస్ ఎండిసిలో బ్లాక్ లిస్టులో పెట్టారని అన్నారు. అయినా అధికారులు వాటిని ఆపకుండా దర్జాగా సిటీలోనికి అనుమతి ఇస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు వారి లారీలను ఆపాలని డిమాండ్ చేశారు. పోలీస్ కమిషనర్ రంగనాథ్ కి కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ సమా వేశంలో విజేందర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, మల్లారెడ్డి అనంతరెడ్డి, సోమన్న తదితరులు పాల్గొన్నారు.