Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటలు ఎండిపోతున్నాయని ఆందోళనలో రైతులు
నవతెలంగాణ - శాయంపేట
పంటలకు సాగునీరు అందించడానికి నిర్మించిన డిబిఎం 31, 10 ఆర్ కాలువ ద్వారా సాగునీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నా యని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా పంటలకు సాగునీ రందిస్తుండగా 10 ఆర్ కాలువ ప్రక్కన ఆయకట్టు రైతులు మొక్కజొన్న పంట సాగు చేశారు. ప్రస్తుతం మొక్కజొన్న మద్యస్థ దశలో ఉందని, కొన్నిచోట్ల పీచు వేసే దశకు చేరుకున్నాయని రైతులకు తెలిపారు. బుధవారం ఉదయం నుండి సాగునీరు సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఎస్సారెస్పీ అధికారులు స్పందించి ఉపకాలవల ద్వారా సాగునీరు అందించి పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.