Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య
నవతెలంగాణ - ములుగు
అంబేద్కర్ భవన నిర్మాణ స్థలం అక్రమాలకుల గురి కాకుండా చుట్టు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. కలెక్టర్‌ను జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీ ఎస్, మాదిగ దండోరా,ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కమిటీ సభ్యులు బుదవారం కలిసి బండారుపల్లి రోడ్డుకు అంబేద్కర్ భవన్‌కు స్థలం కేటాయించి సంవ త్సరాలు గడుస్తున్న నేటికీ భవన నిర్మాణం కాల యాపన చేస్తున్నారని విన్నవించారు. ఈ సందర్భంగా మాదిగ దండోరా జాతీయ నాయకులు నెమలి నర్సయ్య మాదిగ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు చుంచు రవి కలిసి వినతపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ భవన్ స్థలం ఎవరైనా ఆక్రమించుకోవాలని చూస్తే ఊరుకోనేది లేదన్నారు. తప్పనిసరిగా చుట్లూ ప్రహరీ అంచనా వ్యయం తీసుకొస్తే ప్రహరీ నిర్మిస్తామన్నారు. జిల్లాలో అంబేద్కర్ భవన్ (ఎస్సీ కమ్యూనిటీ హాల్స్)కు ఫైనా న్షియల్ అప్రూవల్ ఇబ్బందులు అవుతున్నందున 10, 15 రోజులలో ఉన్నతాధికారులతో మాట్లాడి జిల్లాలో అన్ని భవనాలు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ ములుగు టౌన్ అధ్యక్షులు మరాఠీ రవీందర్ మాదిగ, జిల్లా నాయకులు నద్దునూరి రమేష్ పాల్గొన్నారుర.