Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు
నవతెలంగాణ-తొర్రూరు
ప్రభుత్వ నిషేధిత నల్ల బెల్లం, పటిక, గుడుంబా వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని వరంగల్ డిప్యూటీ ఎక్సైజ్ కమి షనర్ జి.అంజన్ రావు అన్నారు. బుధవారం స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో మహ బూబాబాద్ జిల్లాలో నల్ల బెల్లం, పటిక, గుడుంబా, నాటుసారా అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. అధి కారులు దాడులు చేసిన క్రమంలో భారీగా పట్టుబడు తుందని తెలిపారు. వీటిని పూర్తిగా నిర్మూలించేందు కు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది అన్నా రు. నేటి నుండి 45 రోజులపాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అందుకు గాను తొర్రూరు, నెల్లి కుదురు దంతాలపల్లి, నర్సింలపేట, మరిపెడ, జన గామ, పెద్ద వంగర మండలానికి ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందంలో ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుల్లు ఉంటారన్నారు. వీరు ఈ నలభై ఐదు రోజులపాటు ప్రజలకు, ప్రజా ప్రతినిధు లకు అవగాహన కల్పిస్తూ వారి సహకారంతో గ్రామా ల్లో విస్తృత దాడులు నిర్వహిస్తారని తెలిపారు. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ కేసులో నిందితులైన వారి పై పీడీ యాక్ట్‌తో పాటు రెండు లక్షల రూపా యల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నా రు. స్థానిక సివిల్ పోలీసుల సహకారం కూడా తీసు కుంటామన్నారు. గుడుంబా తయారీకి ఉపయోగించే ముడి సరుకులు ఎవరు అమ్మినా కఠిన చర్యలు తీసు కుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సీఐ ఏ శ్రీనివాసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.