Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియామేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్
బల్దియా బడ్జెట్ నగర అభివృద్ధికి దిక్సూచిక అని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరం గల్ మహా నగర పాలక సంస్థకు సంబంధించిన 2023-24 సంవత్సరానికిగాను ముసాయిదా బడ్జె ట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్ష తన బుధవారం పాలక వర్గం ఆమోదించిందిన అనం తరం బల్దియా మేయర్ గుండు సుధారాణి మాట్లా డుతూ 612.29 అంచనా బడ్జెట్లో రూ.213 కోట్ల 63 లక్షలు సాధారణ పన్నుల ద్వారా రూ.394 కోట్ల 16 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. ప్రజలపై పన్నుల భారం లేకుండా తొలిసారిగా పాలకవర్గ బడ్జెట్ను ప్రవేశ పెడుతు న్నామని, మంత్రి, ఎంఎల్సిలు, ఎంఎల్ఏలు, కార్పొ రేటర్ల సహకారంతో తక్కువ సమయంలోనే గ్రేటర్ వరంగల్ నగరాన్ని అభివృద్ధి పరిచేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని,అందరి సహకారంతో రానున్న రోజు ల్లో వరంగల్ నగరాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ మహానగర పాలకవర్గం కొలువుదీరిన తర్వాత రెండవసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని, నగర ప్రజలకు ఎలాంటి పన్నుల భారం లేకుండా ఈ ఏడాది 2023-24 ఆర్థి క సంవత్సరం అంచనాలు-వ్యయాలు సిద్ధం చేయ డం జరిగింది. బల్దియా బడ్జెట్లో వాస్తవాలకు దగ్గర గా ఉండేందుకు కొన్ని సవరణలు చేయడం జరి గింది. ఈబడ్జెట్ డివిజన్ల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.టి.రామారావుల దిశా నిర్దేశానుసారం వరంగల్ నగర అభివృద్ధికి దీర్ఘకాలికమైన ప్రణాళికలు రచిం చడం జరిగిందని అన్నారు.
అనంతరం వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మహానగరంలో మంచి నీటిసరఫరా, అభివృద్ధి పనులపై సమీక్షించిన నేపధ్యంలో ఆయా పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రవే శ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయో గ్యంగా ఉన్నదని బడ్జెట్ కేటాయింపులపై కార్పొరేటర్ లు హర్షం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో ఎంఎల్ సి బస్వరాజు సారయ్య, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ , జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీణ్య, డిప్యుటీ మేయర్ రిజ్వాన శమిమ్ మసూద్, తదితరులు పాల్గొన్నారు.