Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్ డెస్క్
మండలంలోని నాంచారి మడూరు గ్రామంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న వేణుగోపాల స్వామి గుడి, శివాలయం పున:ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో భా గంగా బుధవారం ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్ర మంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కెసిఆర్ వచ్చాకే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని, యాదాద్రి మహిమాన్విత క్షేత్రంగా మారిందని, ఇదే తరహాలో పాలకుర్తి నియోజకవర్గంలోని దేవాలయా లను కూడా పునరుద్ధరిస్తూ, పూర్వ వైభవాన్ని తెస్తు న్నాం అన్నారు. నియోజకవర్గ దేవాలయాలను ఆధ్యా త్మిక, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నాము అని తెలిపారు. సీఎం కెసిఆర్ అధ్వర్యంలో దేవాల యాలకు మరింత పేరు ప్రతిష్ఠలు వచ్చే విధంగా పని చేస్తున్నామని, ఈ దేవాలయాలకు కూడా మంచి గుర్తింపు వచ్చే విధంగా చేసి భక్తి ప్రపత్తులు పెరిగి, ప్రజల్లో సాత్విక లక్షణాలు పెంపొందాల్సిన అవసరం ఉందన్నారు. భక్తి భావంతో సమాజంలో శాంతిని నెలకొల్పవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల య నిర్మాత కోడూరు నరసింహారెడ్డి, ఎంపీపీ తూర్పా టి చిన్న అంజయ్య, జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్, పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్ రామ చంద్రయ్య శర్మ, డిసిసిబి డైరెక్టర్ కాకిరాల హరిప్రసా దరావు, రామసాయం కిషోర్ రెడ్డి స్థానిక సర్పంచ్ గుంటుక యాదలక్ష్మి, ఎంపీటీసీ కుంభం సుకన్య, మండల పార్టీ అధ్యక్షులు సీతారాములు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.