Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవాలాల్ సేన జిల్లా కార్యదర్శి తేజావత్ రవీందర్ నాయక్
నవతెలంగాణ-బయ్యారం
హైదరాబాద్ కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందేనని, కుక్కల బారి నుండి పెద్దవారు చిన్న పిల్లలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సేవాలాల్ సేన జిల్లా కార్య దర్శి తేజావత్ రవీందర్ నాయక్ అన్నారు. బుధ వారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్ కుమారుడు అయిదు సంవత్సరాల ప్రదీప్ అనే చిన్నా రి కుక్కల దాడిలో చనిపోయాడని, ఇందల్వాయికి చెందిన గంగాధర్ హైదరాబాదులోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడని, ఆదివారం తా ను పనిచేసే ప్రాంతానికి కొడుకును తీసుకువెళ్లాడని, ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలు ఆ బాలు డు పై ఒక్కసారిగా దాడి చేశాయని, ఆసుపత్రికి తీసు కువెళ్లగా అప్పటికే మృతి చెందడం చాలా బాధించిం దని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దీని పై స్పందించి విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలను అదుపు చేయాలని, ఈ కుక్కల వల్ల బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారని, ఏ వీధిలో చూసిన కుక్కల అలజడి ఉన్నదని, ఆయా గ్రామ పంచాయతీ ల సిబ్బందులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో తీసుకువచ్చి కుక్కలన్నింటినీ చంపించడమా, వేరే ఏదైనా మార్గమో ఆలోచన చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సేవాలాల్ రైతు సేన మండల అధ్యక్షులు గుగులోతు నరేష్ నాయక్, చిరంజీవి నాయక్, లక్ష్మా నాయక్, రఘు నాయక్, బానోతు మంగీలాల్ నాయక్, చంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.