Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐలయ్య
నవతెలంగాణ-పెద్దవంగర
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 26న నిర్వహించే సద్గురు సంతు సేవాలాల్ మహారాజ్ జ యంతి ఉత్సవాలకు ప్రజలు భారీ ఎత్తున తరలిరావా లని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని పడమ టి తండా, బావోజీ తండాలో నిర్వహించిన సమావే శంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర పంచా యతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో సంతు సేవాలాల్ మహారాజ్, మేరమ్మ యాడి దేవాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 3000 పైగా తం డాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశాడని పేర్కొన్నారు. గిరిజన రిజర్వేషన్లు పెంచిన ఘనత సీ ఎం కేసీఆర్ దక్కుతుందన్నారు. రూపాయలు రెండు కోట్లతో సంత్ సేవాలాల్ ఆలయాన్ని, కోటి రూపాయ లతో జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నటి లేని విధంగా ఘనంగా నిర్వహిస్తుం దని తెలిపారు. మండల వ్యాప్తంగా ప్రజలు సంతు సేవాలాల్ జయంతి ఉత్సవాలను విజయవంతం చే యాలని కోరారు. కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రాంచంద్రయ్య శర్మ, మండల నాయకులు బానోత్ వెంకన్న, శ్రీరాం సుదీర్, సర్పం చ్లు ధరవత్ రాజేందర్, బానోత్ జమున గోపాల్, ఎం పీటీసీ బానోత్ విజయ సోమన్న, గ్రామ పార్టీ అధ్య క్షులు ధరవత్ బుజ్జమ్మ, బానోత్ శ్రీనివాస్, జాటోత్ రవీందర్, భూక్యా అంజయ్య, జాటోత్ సీతారాం, జాటోత్ శంకర్, జాటోత్ వెంకన్న పాల్గొన్నారు.