Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మిగౌడ్ సేవలు అభినందనీయం-వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, వ్యవసాయ అధికారి వెంకన్న
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
ప్రజా సేవ చేయాలంటే ఎటువంటి పదవులు అవసరం లేదని, రాజకీయ పదవులు లేకున్నా గాని పేద వాడి కుటుంబాలకు సేవకుడిగా బీఆర్ఎస్ మండల నాయకులు, గోపా మహబూబాబాద్ డివి జన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ నిలుస్తు న్నాడని రాష్ట్ర మార్క్ ఫ్రెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు అన్నారు.సమ్మిగౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేస ముద్రం మండలంలోని అమీనపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ప్రజాప్రతినిధులు ఎస్.ఐ రమేష్ బాబు,వ్యవసాయ మండల అధికారి వెంకన్న సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం పేద మహిళ కుటుంబాలైన కేసముద్రం విలేజీకి చెందిన మహ్మద్ అబేదా, అమీన పురం గ్రామానికి చెందిన బంటు అమీదలకు కుట్టు మిషన్లను సమ్మిగౌడ్ ఫౌండేషన్ సహకారంతో అందజేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజ రైన ఎస్ఐ రమేష్ బాబు మాట్లాడుతూ మహిళలకు అందజేసిన కుట్టు మిషన్ వారి కుటుంబ పోషణకు ఉపయోగకరంగా ఉంటుందని సమ్మిగౌడ్ను అభి నందిస్తూ భవిష్యత్లో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్ర మాలు చేయాలన్నారు. మతాలకతీతంగా సమ్మిగౌడ్ సేవలు అభినందనీయం అని వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి అన్నారు. హాజరైన వ్యవసాయ మండల అధికారి వెంకన్న మాట్లాడుతూ సమ్మిగౌడ్ తనదైన శైలిలో పేద ప్రజల గుండెల్లో నిలిచి పోయే కార్యక్రమాలు చేస్తున్నారని అభివర్ణించారు. ఈ సందర్భంగా సమ్మి గౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సమ్మిగౌడ్ మాట్లాడు తూ పేద వారికి,అత్యవసర సమయాల్లో ఆపద ఎదు రైన వారికి నిరంతరం సేవ చేయాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ అని,ఏ ఆపద వచ్చిన సమ్మి గౌడ్ ఫౌండేషన్ ముందు వరుసలో ఉంటుందన్నా రు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దామరకొండ ప్రవీణ్, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు మోడెం రవీందర్ గౌడ్, కెజీకేఎస్ జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న, ఉప సర్పంచ్ ముత్యాల నాగమణి-శివ కుమార్, జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు నలమాస సాయి,గోపా జిల్లా ఉపాధ్యక్షులు చిర్ర యాకాంతం గౌడ్,సర్పంచ్ లు గందసిరి స్వరూప సోమన్న, కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, కదర ప్రకాష్, వేం సంపత్ రెడ్డి, నీలం యాక య్య, సమ్మిరెడ్డి, కొమ్ము రాహుల్, గుగులోత్ శంకర్, అనసూర్య, శివారపు శ్రీధర్, సామల నరసయ్య, కోమ ల, రజిత, ఎల్ల గౌడ్, దాసు, రాజా, గొట్టం లక్ష్మీనారా యణ, గొట్టం సుభాష్, ఎర్రంశెట్టి అశోక్, కముటం స్వామి, సంకేపల్లి శ్రీనివాస్,బండారి గోపీ, రడం శ్రీని వాస్, గాజగోని వీరన్న, కొలిపాక బాబు, బానోతు శంకర్ నాయక్, మోడం రాజు, పెదగాని వెంకన్న, మంద సాయి బాబా, గుణగంటి అశోక్, బండారు నరేష్, సుధాకర్, శాగంటి రాము, రాజేష్, జావీద్, బిక్షపతి, మాన్ సింగ్,లింగాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.