Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దంతాలపల్లి
దంతాలపల్లి మండలం 2016లో నూతనంగా మండలగా ఏర్పడినకానీ.. నేటికీ అభివృద్ధికి నోచు కోలేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బట్టు నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు గడిచిన నూతన మండలాలుగా ఏర్పడిన మండలాలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. రోజురోజుకు కేంద్రంలో రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుందని అన్నా రు. నూతన మండలాలుగా ఏర్పడిన మండలాల్లో అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయల నిర్వహణ అస్త వ్యస్తంగా ఉన్న, ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. రైతు ల సబ్సిడీలు ఎత్తివేసి రైతు వ్యతిరేక ప్రభుత్వాలుగా మారాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసమే ఉందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థ లను ప్రైవేట్ రంగ సంస్థలుగా చేస్తూ కార్పొరేట్ శక్తు లకు మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్ని స్తోందన్నారు. కెేసీఆర్ పాలనకు కాంగ్రెస్ కార్యకర్తలు చరమగీతం పాడాలన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజా ప్రతిని ధులు, అధికారులతో కుమ్మకై రైతుల నడ్డి విరుస్తున్నా రన్నారు. ఈ సమావేశంలో సాధు లింగారెడ్డి, డీ.రాజ శేఖర్, దాట్ల ఎంపీటీసీ కొమ్మినేని సతీష్, రామ్ రెడ్డి, కే.మహేం దర్, జానీ పాషా, సంపత్ కుమార్, హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.