Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనఊరు-మనబడి సమీక్ష సమావేశం
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని మన ఊరు-మనబడి పథకం కింద ఎంపిక కాబడిన 17 పాఠశాలలకు చెందిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అని మండల ప్రత్యేక అధికారి సంజీవ రెడ్డి, ఎంపిడిఓ చక్రాల సంతోష్ కుమార్లు సూచించారు. మండల కేంద్రంలోని మదర్ థెరిస్సా మండల సమా ఖ్య కార్యాలయంలో బుధవారం మన ఊరు - మన బడి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావే శానికి ఆయా గ్రామాల సర్పంచ్లు, విద్య కమిటీ చైర్మ న్లు, హెడ్మాస్టర్లు, పంచాయతీ సెక్రెటరీ హాజర య్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠ శాలల వారీగా ఇంకా పూర్తికాని పనుల విషయ మై సంబంధిత సర్పంచ్లను సెక్రటరీలను హెడ్మాస్టర్ల ను మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరెడ్డి, ఎంపీడీఓ సంతోష్ కుమార్ వివరణలు అడిగారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పూర్తయిన పనులకు పేమెంట్ త్వరగా ఇప్పెంచే బా ధ్యత తమదే అని, సర్పంచులు ఎటువంటి అపోహ లు లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మన ఊరు-మనబడికి సంబంధించిన పెండిం గ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో అధికారులం దరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించా రు. సకాలంలో పనులు పూర్తి కాకపోతే చర్యలు తప్పవని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మండ ల నోడల్ ఆఫీసర్ లింగారెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్, ఈజీఎస్ ఏపిఓ సుశీల్ కుమార్, ఏఈ కష్ణాకర్, మన ఊరు మనబడికి చెందిన 17 గ్రామాల సర్పంచ్లు, విద్యాకమిటి చైర్మన్లు, హెడ్మాస్టర్లు, పంచాయితీ సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.