Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా ప్రథమ వార్శికోత్సవం
నవతెలంగాణ-దంతాలపల్లి
భారతదేశంలో ప్రజలు తమపై సాగుతున్న అనేక రకా ల దోపీడీనీ రూపుమాపడానికి విప్లవ మే ఏకైక పరిష్కారం అని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తొర్రూర్ డివిజన్ నాయ కులు సెగ్గం యాకయ్యఅన్నారు.సీపీఐ(ఎంఎల్)ప్రజా పంథా ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ప్రజాపంథా జెండా మండ లంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో బుధవారం ఆవిష్కరిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో రక రకాల రూపాలలో ప్రజలపై సాగుతున్న దోపీడీ అణిచివేత వివక్షత పోవాలంటే జనతా ప్రజాతంత్ర విప్లవ మార్గంలో పోరాడాలని ఆయన పిలుపు నిచ్చారు. పాలకవర్గ పార్టీలు ప్రజల మధ్య చీలిక తీసుకువచ్చి మరింత కాలం అధికారా న్ని స్థిరపరుచుకుంటూ బహుళ జాతి కంపెనీలకు దేశ ప్రజ ల శ్రమశక్తిని సహజ సంపదలను దోచిపెడుతున్నారని అన్నా రు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకవైపు కార్పొరేట్ అనుకూల చట్టాలతో దేశ ప్రభుత్వ రంగ సంస్థలను, సహజ సంపదలను దోచిపెడుతూ మరోవైపు మతం పేరుతో కులం పేరుతో ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి పరిపాలన కొనసా గిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ప్రజాస్వామికవాదులు లౌకిక వాదులుపోరాడలన్నారు.బంగారు తెలంగాణ తెస్తాన న్న కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలలో ప్రజల కనీస అవసరా లు తీర్చడంలో పూర్తిగా విఫలమైనారన్నారు. ఇంటికో ఉద్యో గం ఇవ్వలేదని కోటి ఎకరాలకు సాగునీరు అందలేదని, రైతు రుణమాఫీ అమలు కాలేదని, రైతు పంటకు బోనస్ ఇవ్వలేద ని నిరుద్యోగ భృతి ఊసే లేదని, కేజీ టు పీజీ ఉచిత విద్య అడ్రస్ లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ నాయకులు ఎరుగొండ ఉప్పలయ్య, శ్రీను కొమురయ్య ప్రవీ ణ్, బిక్సమ్ వెంకన్న రాజన్నలి తదితరులు పాల్గొన్నారు.
దోపిడి వ్యవస్థ అంతంతో సకల సమస్యలు పోతాయి
తొర్రూరు : భారతదేశంలో ప్రజలు తమపై సాగుతున్న అనేక రకాల దోపీడీనీ రూపుమాపడానికి వ్యవస్థ మార్పే ఏకై క పరిష్కారం అని సీపీఐ (ఎంఎల్ )ప్రజాపంథా తొర్రూర్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద ప్రజాపంథా జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ ఎంఎల్ తొ ర్రూరు సబ్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అధ్యక్ష తన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్య క్రమంలో యాకయ్య, శేఖర్, బాలు, చరణ్, వెంకటయ్య, వెం కన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ప్రథమ ఆవిర్భావ దినోత్సవం...
బయ్యారం: సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా ప్రథమ ఆవి ర్భావ దినోత్సవాలు బుధవారం మండలంలోని ఇరుసులా పురం, కోటగడ్డ, గంధంపల్లి గ్రామాలలో పార్టీ ప్రథమ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా ఎర్రజెండాలను ఎగరవేయ డం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి జగ్గన్న, మండల కార్యదర్శి బిల్లకంటి సూర్యం మాట్లాడారు. సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ ఏర్పడి నేటికీ సంవత్సరం అవు తున్న సందర్భంలో పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మండలంలోని గ్రామాలలో జెండాలు ఎగురవేయడం జరి గిందన్నారు. భారత కమ్యూనిస్టు విప్లవ అధ్యాయం ప్రారం భమై 13 ఏండ్ల కాలమైందని శతాబ్ది ఉత్సవాల నిర్వహించు కున్నది. అలానే నక్సల్ బరీ శ్రీకాకుళం ఉద్యమల సాయుధ సంఘర్షణ కాలానికి 50 ఏళ్లు దాటిందన్నారు. సీపీఐ (ఎం ఎల్) ప్రజాపంథా ప్రజా ఉద్యమాలను పటిష్టపరిచి ఈ ప్రభు త్వాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అ నునిత్యం పోరాటాల నిర్వహిస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఎందరో అమరవీరులు ఈ జెండా కోసం రక్తతర్పణం చేశా రని,వారి ఆశయ సాధన కోసం సీసీఐ (ఎంఎల్) ప్రజాపంథా కార్యకర్తలు విప్లవ ఉద్యమంలో ముందుండాలని పిలిపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఉమ్మగాని సత్యం, మం డల నాయకులు జక్కుల యాకయ్య, నూతక్కి మధుసూదన్ రావు, కస్తాల శ్రీను, కత్తి అశోక్, గండెల సోమయ్య, ఇరుప సుగుణ, ముత్యాల భద్రయ్య, పూజల లచ్చయ్య బత్తుల ధనుంజయ, కాష్మోల వెంకన్న, ఎస్కే జానీ తదితరులు పాల్గొన్నారు.
కనీస అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం విఫలం...
పెద్దవంగర: ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ (ఎంల్) ప్రజాపంథా మండల కార్యదర్శి చింత నవీన్ అన్నారు. బుధ వారం మండల కేంద్రంతో పాటుగా అవుతాపురం గ్రామాల్లో సీపీఐ (ఎంల్) ప్రజాపంథా ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జెండాను ఆవి ష్కరించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడి వ్య వస్థను ప్రోత్సహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపి డీ వ్యవస్థను కూల్చడమే ప్రజాపంథా లక్ష్యమన్నారు. పాలక వర్గాలు ప్రజలను అణిచివేతకు గురి చేస్తూ వివక్షతను చూ పుతున్నారని విమర్శించారు. దేశ సహజ సంపదను, శ్రమ శక్తిని కార్పొరేట్ శక్తులకు, బహుళ జాతీయ కంపెనీలకు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు మతం, కులం పేరుతో ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి, పరిపాలన కొన సాగించడం సిగ్గుచేటు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసిందని పేర్కొన్నారు. ఇం టికో ఉద్యోగం, కోటి ఎకరాలకు సాగునీర్ను, రైతు రుణమా ఫీ, రైతు పంటకు బోనస్, నిరుద్యోగ భతి, కేజీ టు పీజీ ఉచి త విద్య వంటి హామీలను అమలు చేయకుండా కాలయా పన చేస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధా నాలపై అలుపెరుగని పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు సబ్ డివిజన్ నాయ కులు గుగులోత్ ఫుల్ సింగ్ నాయక్, సందీప్, అఖిల్, ప్రశాంత్, ఎల్లయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.