Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
ఫిబ్రవరి 27న రాష్ట్ర ఐటీిశాఖ మంత్రి కేటీఆర్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వేలేరు మండలానికి రానున్నారు. చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని కరువు పీడిత, ఎత్తైన గ్రామాలకు సాగునీరు అందించడం కోసం రూ.133 కోట్ల అంచనాతో మంజూరైన ఇరిగేషన్ ప్రాజెక్టుకు మంత్రి కేటీఆర్ శం కుస్థాపన చేయనున్నారు. పర్యటన విజయ వంతం కోసం రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ - హనుమకొండ లోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి మంత్రి మాట్లాడారు. తీవ్ర కరువుతో కొట్టు మిట్టాడుతున్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ, ప్రత్యేకించి వేలేరు, చిల్పూరు, ధర్మసాగర్ మండలాల రైతులకు సాగు నీరు అందించే ప్రాజెక్టు కు సీఎం కెసిఆర్ భగీరథ ప్రయత్నం, మంత్రి కేటీఆర్ చొరవతో నిధులు మంజూరు అయ్యా య న్నారు. శంకుస్థాపన చేయడానికి కేటీఆర్ రావడం హర్షించదగ్గ విషయం అ న్నారు. కేటీఆర్ పర్యటన విజయవంతం కోసం పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కషి చేయాలన్నారు. శంకుస్థాపన ప్రదేశం , బహిరంగ సభ నిర్వహణ , జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆయా విభాగాల వారీగా ఇంచార్జీలను, మండలాల వారీగా ఇంచార్జీ లను నియ మించారు.ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, కుడా చైర్మన్ సుందర్ రాజ్‌యాదవ్, జెడ్ పి చైర్మన్లు సంపత్ రెడ్డి, సుధీర్ కుమార్ పాల్గొన్నారు.