Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్రకు ఉద్యోగుల వినతి
నవతెలంగాణ-గణపురం
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపచేయాలని భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి బుధవారం ఉపాధి హామీ ఉద్యోగుల జాక్ కమిటీ చైర్మన్ ఎస్కె. జమీర్ పాష, అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోరే కుమార్ స్వామి, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ జిల్లా అధ్యక్షుడు విఠల్ దుబాసి, జాక్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శ్రీనివాస్‌రావు వినతిపత్రం అందించారు. గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేస్తున్న సెర్ఫ్ సిబ్బందికి అసెంబ్లీలో ఏప్రిల్ నుండి పే స్కేల్ అమలు అవ్వు తుందని ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం జరిగిందని అన్నారు. అదే శాఖలో 20 సంవత్సరాల నుండి పని చేస్తున్న ఉపాధి ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించ లేదన్నారు. ఉపాధి ఉద్యోగులకు కూడా పే స్కేలు ఇ వ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూపాలపల్లికి వస్తున్న సందర్భంగా తమను కేటీఆర్‌ను కలిసేలా అవకాశం కల్పించాలని కోరారు.