Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- శాయంపేట
హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర నగరంలోని అథ్లె టిక్స్ స్టేడియంలో ఈనెల 16 నుండి 19 వరకు జరిగిన నాల్గవ జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ -2023 పోటీలలో తెలంగాణ రాష్ట్రం తరఫున ఎల్ఐసి పరకాల బ్రాంచ్ ఉద్యోగి బలభక్తుల శ్రీహరి పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. 110 మీటర్ల హర్డిల్స్ విభాగంలో సిల్వర్ మెడల్( రజత పతకం), 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. జాతీయస్థాయిలో ప్రతిభ చూపడంతో, ఈ ఏడాది మే నెలలో సౌత్ కొరియా లో జరిగే అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ లో పాల్గొ నేందుకు అర్హత సాధించాడు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన శ్రీహరిని బుధవారం పరకాల ఎల్ఐసీ కార్యాలయంలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్ కెఎస్ ఇలంగోవన్ సత్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి దేశ కీరిని ఇనుము డింపజేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు శ్రీరమ, బి రాజ్‌కుమార్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఏ అరుణ్ మిత్ర, ఆర్ భగవాన్కుమార్, వి చానక్య గుప్తా, సిహెచ్ పాపిరెడ్డి, లియాఫీ పరకాల శాఖ అధ్య క్షులు బూర బాబు, అశోక్‌రావు, యు గేంద్రాచారి, తదితరులు పాల్గొన్నారు.